L And T Chairman Subrahmanyans comments that youth should work 90 hours a week: రోజుకు ఎనిమిది గంటల డ్యూటీ, వారానికి ఆరు రోజులు పని చేస్తే మనిషి అలసిపోతాడు. అయితే కార్పొరేట్ పెద్దలు మాత్రం ఇంకా ఇంత బద్దకంగా ఎలా ఉంటారని  ప్రశ్నిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణనూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని కామెంట్ చేసి చాలా రోజులు అయింది. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చాలా మంది అలా ఎలా సాధ్యమవుతందని ఇక కుటుంబాలు లేకుండా ఆయా కంపెనీలకు వెట్టి చాకిరి చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. పెద్దాయనకు చాదస్తం అని చాలా మంది లైట్ తీసుకున్నారు. 


ఇప్పుడు లార్సన్ అండ్ టూబ్రో చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంకా చెప్పాలంటే ఇన్ఫోసిస్ ఫౌండరే చాలా దయార్ద్ర హృదయుడు అనుకునేలా చేశారు. యువత వారానికి 90  గంటలు పని చేయాలని సుబ్రమణియన్ సలహా ఇస్తున్నారు. ఇంట్లో భార్య ముఖం ఎంత కాలం చూస్తారని ఆయన అంటున్నారు. రోజుకు పదమడు గంటల పాటు .. ఆదివారాలు కూడా పని చేస్తే మన దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందని ఆయన సలహా ఇస్తున్నారు.  ఇంట్లో తక్కువ సమయం.. ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలని ఆయన సలహా ఇస్తున్నారు. 


అంతే కాదు ఆదివారాలు మీతో పని చేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నాని తన కంపెనీ ఉద్యోగులకు చెప్పారు. తాను ఆదివారాలు కూడా పని చేస్తున్నానని మీతో ఆ పని చేయించలేకపోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. సుబ్రమణియన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఉద్యోగుల్ని కంపెనీల్లోనే ఉంచేసుకుని వారు నిద్రపోవడానికి తిండి తినడానికి సమయం ఇస్తే అక్కడే పడి ఉంటారని సలహాలు కూాడా ఇస్తున్నారు. పూర్వకాలంలో బానిసలు ఉండేవారని.. ఇప్పుడు అలాగే చేద్దామని అనుకుంటున్నారు. 



నిజానికి చాలా మంది కార్పొరేట్ ప్రముఖులు.. ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారు శని, ఆదివారాలు తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలూ పని చేస్తంటారు. సమయం దొరికినప్పుడే తిని, నిద్రపోతూంటారు. కుటుంబాలను కూడా పెద్దగా పట్టించుకోరు. మిగతా ఉద్యోగులుకూడా అలాగే పని చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ లు కోరుకుంటున్నారు. అలా అయితనే మన దేశ ఉత్పాదకత పెరుగుతుందని వారంటున్నారు. ఇలాంటి డిమాండ్లు పెరిగిపోతే రాను రాను ఉద్యోగుల పని గంటలు పెంచాలన్న డిమాండ్లు వచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.   


Also Read: ఒరే ఆజాము ఎంత గ్యాంగ్‌స్టర్‌వి అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజు ఇలా చేయాలా ? - అదిత్యనాథ్ ఒక చూపు చూస్తే ...