Kolkata sex workers Called Not to rape women : కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన దేశ ప్రజలందరి మనసుల్ని కలచి వేసేలా చేసింది. అందరూ ఈ ఘటనను ఖండిస్తున్నారు. సెక్స్ వర్కర్లు కూడా ఇలాంటి అఘాయిత్యాలు చేయవద్దని కోరతూ రోడ్డు ఎక్కి ప్రదర్శనలు చేస్తున్నారు. తమ విజ్ఞప్తులు చేస్తున్నారు. 


కోల్‌కతాలోని సోన్‌గచ్చి ప్రాంతం సెక్స్ వర్కర్లకు ప్రసిద్ధి. అక్కడి సెక్స్ వర్కర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ కుటుంబానికి తమ సంఘిభావం తెలిపారు. ఈ సందర్భంగా సెక్స్ వర్కర్ల ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేసేందుకు మహిళల్ని వేదించవద్దని వేడుకున్నారు. అలాంటి శారీరక అవసరాల కోసం అయితే తామున్నామని గుర్తు చేస్తున్నారు. మీలాంటి వారికి శారీరక అవసరాలు తీర్చడానికి తామున్నామని.. బలవంతంగా ఎవరినైనా రేప్ చేయడం మంచిది కాదన్నారు. 


 





 
సోనాగచి దేశంలో ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఉండే ప్రాంతంగా గుర్తింపు పొందింది.  సోనాగచ్చి రెడ్‌లైట్ ఏరియాలో సుమారు 11వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడకు రోజూ 30 వేల మంది విటులు వస్తుంటారని అంచనా. వీరంతా విధి లేక ఈ వృత్తిలోకి వచ్చారు. వ్యభిచారం చట్టబద్ధం కాకపోయినప్పటికీ.. ఈ విషయంలో వారి ఉపాధిని ప్రభుత్వాలు దెబ్బతీయవు. మహిళలపై జరుగుతున్న అరాచకాలతో వీరు కూడా మథన పడుతున్నారు. అందుకే స్వచ్చందంగా ముందుకు వచ్చి పిలుపునిస్తున్నారు. 


శారీరక కోరికలు తీర్చడానికి తామున్నామని అమాయకులైన మహిళలు, యువతలపై దాడులు మాత్రం వద్దని కోరుతున్నారు. వీరి పిలుపులోనూ నిజాయితీ ఉందని.. మహిళలపై అత్యాచారాలు చేయకుండా.. జరగకుండా..   తమ వంతు పిలుపు ఇచ్చారని పలువురు ప్రశంసిస్తున్నారు.                 


కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచారం ఘటన ఇప్పటికీ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.  మహిళల భద్రతకు అనేక చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల వైద్యులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ వైద్యులందరితో కలిసి ఓ కమిటీని నియమించింది. వైద్యులు, మెడికల్ సిబ్బంది  భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేయనుంది. మరో వైపు సమాజంలోని అన్ని వర్గాలు.. ఇలాంటి దశ్చర్యలకు పాల్పడటం అంటే.. అనాగరిక సమాజంలోకి వెళ్లడమేనని.. అలాంటి నేర ప్రవృత్తి ఉన్న వారిని తక్షణం శిక్షించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.