Sanjay Roy : కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టు 9, 2024న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు అనూహ్యమైన తీర్పు వెలువరించింది. నిందితుడైన సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చింది. సంజయ్ రాయ్ పై బీఎన్ఎస్ సెక్షన్లు 64,66,103/1 కింద అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేసినట్టు పశ్చిమ బెంగాల్ లోని సీల్దా కోర్టు వెల్లడించింది. నిందితుడికి సోమవారం మ. 12.30గంటలకు శిక్ష ఖరారు చేయనున్నట్టు సమాచారం. అయితే రాయ్ పై నమోదైన కేసులను బట్టి చూస్తే అతనికి 25ఏళ్లు లేదా జీవిత ఖైదు లేదా మరణశిక్షణను విధించే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

సంజయ్ రాయ్ ఎవరు?

ఆగస్టు 9న 2024న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహం ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లో లభ్యమైంది. ఆ తర్వాత నిర్వహించిన మహిళ శవపరీక్షలో అనేక అంతర్గత, బాహ్య గాయాలు బయటపడ్డాయి.ఈ క్రమంలోనే సివిల్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ పేరు వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన ఒక రోజు తర్వాత రాయ్ ఆగస్టు 10న అరెస్టయ్యాడు. ఆగస్టు 9 తెల్లవారుజామున 4.03 గంటలకు అతను సెమినార్ గదిలోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.

రాయ్ అరెస్ట్ తర్వాత అతని మాజీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ పలు విషయాలను వెల్లడించారు. రాయ్ తన మాజీ భార్యను కొట్టేవాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆరోపించారు. "సంజయ్ మంచి వ్యక్తి కాదు. అతన్ని ఉరితీయండి లేదా అతన్ని ఏం కావాలంటే అది చేయండి" అని ఆమె చెప్పింది. రాయ్ మానసిక విశ్లేషణ ఆధారంగా, అతను వక్రబుద్ధిగలవాడు, అశ్లీలతకు తీవ్రంగా బానిసైనట్టు ఓ సీబీఐ అధికారి తెలిపారు. అతనికి జంతువుల వలె ప్రవర్తించే స్వభావం కలవాడని, హత్యపై ఎలాంటి కనికరమూ చూపలేదని చెప్పారు. "ఆ వ్యక్తికి ఈ హత్య చేసినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అతను జరిగిందంతా వివరంగా మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడు. దీన్ని బట్టి చూస్తుంటే అతనికి పశ్చాత్తాపం లేదనిపించింది" అని అధికారి స్పష్టం వెల్లడించారు.

రాయ్ కోర్టులో ఏం చెప్పాడంటే..

ఈ రోజు కోర్టులో దోషిగా తీర్పు వెలువడిన తర్వాత, “నన్ను తప్పుగా ఇరికించారు. నేను ఈ పని చేయలేదు. అలా చేసిన వారిని వదిలేస్తున్నారు. ఇందులో ఒక ఐపీఎస్ ఉన్నారు అని రాయ్ న్యాయమూర్తితో చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే సంజయ్ కు సోమవారం మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఇకపోతే ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన స్టూడెంట్ అత్యాచారం - హత్య ఘటన దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. బాధితురాలికి న్యాయం చేయాలని, వైద్యులకు మెరుగైన భద్రతను కోరుతూ వైద్యులు, నర్సులు, విద్యార్థుల నెలల తరబడి నిరసనలకు దిగారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాదాపు 120మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

Also Read : Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం