తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా... తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల సర్పంచులకు లేఖలు రాస్తామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.... గతేడాది పరేడ్ గ్రౌండ్లో విమోచన ఉత్సవాలను నిర్వహించామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా అదే తరహాలో నిర్వహిస్తామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు బిజెపి కార్యక్రమం కాదని తెలిపారు.


రాష్ట్రపతి నిలయంలో కూడా తెలంగాణ విమోచన ఉత్సవాల నిర్వహిస్తామని తెలిపారు. ఇదే సందర్భంగా సీఎం కేసీఆర్, ఓవైసీ ఇలా తీరుపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఓవైసీ అన్నది ఉంటేనే సీఎం కేసీఆర్ నడుచుకుంటారని చెప్పారు. మజ్లిస్ వాటికి లొంగిపోయి ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. సమైక్యత దినోత్సవం కాదు విమోచన దినోత్సవం తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. మాజీ సీఎం అరోశయ పంచలూడదీయాలని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ప్రశ్నించారు. విమోచన దినోత్సవంలో మొదటి ద్రోహి కాంగ్రెస్ అని.... రెండో ద్రోహి బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్రలో హైదరాబాద్ ముక్తి దివాస్ ను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.  


సమైక్య దినోత్సవం కాదు విమోచన దినోత్సవం జరపాలి.... 
సెప్టెంబర్ 17 న తెలంగాణ సమైక్య దినోత్సవం కాదని... తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని కిషన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా విలీన దినోత్సవం జరుపుదామని చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం మాట మార్చారన్నారు. ఆనాడు నిజం కోసం పాలనకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం వృత్తి చాకిరి నుండి విముక్తి కోసం త్వరలో పాలనకు నైజాం నవాబు పరిపాలనకు వ్యతిరేకంగా రైతంగ సాయుధ పోరాటం కు పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ రైతాంగ సాయుధ పోరాటంలో ఎన్నో వేలమంది వీరమరణం పొందాలని తెలిపారు. పోరాటం ఫలితంగా 10 లక్షల ఎకరాల భూములను పంచిన చరిత్ర ఉందన్నారు. కమ్యూనిస్టుల పోరాటానికి ఏడవ నైజం నవాబు తలకి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి సెప్టెంబర్ 17వ తేదీన సమైక్యత దినోత్సవం కాకుండా తెలంగాణ విలీన దినోత్సవం జరపాలని డిమాండ్ చేశారు. ఇంతటి స్ఫూర్తినిచ్చిన రోజును బిఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోవడం సరికాదన్నారు. 


బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని కిషన్ రెడ్డి విమర్శించారు. రెండు పార్టీలు తెలంగాణ చరిత్రను విమర్శించాలి వెల్లడించారు. గతంలో కూడా ఏ ప్రభుత్వము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని మండిపడ్డారు. ఎందరో చేసిన త్యాగాలను మర్చిపోవడం సరికాదని, వారి త్యాగాలను విస్మరించినట్లే అని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.