తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ సిద్ధమైతే తన సహకారం అందిస్తానని ప్రకటించారు.  వివాదాలన్నింటినీ పరిష్కరించేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందని అందుకే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైకే కేబినెట్ హోదా కలిగిన మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కేంద్రం తరపున ఆయన రెండు తెలుగు రాష్ట్రాల మంచి చెడ్డలు చూస్తారు. అందుకే బాధ్యత తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముందుకు వస్తే పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. Also Read : నవరంధ్రాలుగా నవరత్నాలు


తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను నిర్మించాలని తలపెట్టడం దాన్ని తెలంగాణ వ్యతిరేకించడంతో సమస్య ప్రారంభమయింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం ప్రారంభించారు. దాదాపుగా ప్రతీ అంశంపైనా రెండు తెలుగు రాష్ట్రాలు వరుసగా కృష్ణా బోర్డుకు లేఖలు రాస్తున్నాయి. దీనిపై ఆయా రాష్ట్రాలను కృష్ణాబోర్డు వివరణ కోరుతోంది. ఇది కూడా వివాదాస్పతమవుతోంది. చివరికి గతంలో నీటి పంపకాలపై జరిగిన ఒప్పందాలను కూడా అంగీకరించడానికి తెలంగాణ సిద్ధపడలేదు. కొత్తగా కేటాయింపులు చేయాలని కోరుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పాత కేటాయింపులే కొనసాగించాలని కోరుతోంది. ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో దీనిపై ఏమి తేల్చారో స్పష్టత లేదు. తమ వాదన వినిపించుకోలేదన్న కారణంగా తెలంగాణ అధికారులు సమావేశాన్ని బాయ్ కాట్ చేసివెళ్లిపోయారు. Also Read : డ్రోన్‌తో మందుల డెలివరీ


కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి రెండు నదీ బోర్డులపై నోటిఫై చేసి గెజిట్ జారీ చేసినప్పటికీ అమలు విషయంలో రెండు ప్రభుత్వాలకూ అభ్యంతరాలు ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులనూ బోర్డుల కిందకు తేవడం సరి కాదని వాదిస్తున్నాయి. వివాదం ఉన్న ప్రాజెక్టులను మాత్రమే నోటిఫై చేయాలని కోరుతున్నాయి. కేంద్రం మాత్రం దాదాపుగా అన్ని ప్రాజెక్టుల్ని నోటిఫై చేసింది. నోటిఫై చేయలేదని కొన్ని ప్రాజెక్టులపై వివాదం కూడా ప్రారంభమయింది. ఈ సమస్య రాను రాను జఠిలంగా మారుతోంది. కానీ తగ్గడం లేదు. Also Read : కోర్టుల్లో పోర్టుల అమ్మకం డీల్స్ ! అదానీకి చిక్కులు తప్పవా ?


ఈ కారణంగానే కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేలా పెద్ద పదవిలో ఉన్నందుకు చొరవ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తారా అన్నదే సమస్య. ఎందుకంటే కేసీఆర్, జగన్ మధ్య రాజకీయంగా మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయని చెబుతారు. వారిద్దరూ మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకు మాట్లాడుకోవడం లేదని షర్మిల వరకూ అందరూ విమర్శించారు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి ఆఫర్ ఇస్తే మాత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముందుకు వస్తారా.? Also Read : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా.. అదే కారణమా?