Kim Jong Un Isnomia: 


కిమ్‌కి ఇస్నోమియా 


ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోన్‌ ఉన్ గురించి తెలిసిందేగా. "అంతా నా ఇష్టం" అని వింత వింత రూల్స్ పెట్టేస్తుంటాడు. కిమ్‌ నోటి వెంట ఏది వస్తే అదే చట్టం. మొత్తం దేశాన్ని గడగడలాడించేస్తాడు. అగ్రరాజ్యం అమెరికాకే సవాల్ విసురుతున్నాడు. ఇలా అందరికీ నిద్ర పట్టకుండా చేస్తున్న కిమ్‌ జోన్‌కే నిద్ర కరువైందట. ఓ కొరియన్ స్పై ఏజెన్సీ ఈ విషయం వెల్లడించింది. కిమ్ స్లీపింగ్ డిజార్డర్‌తో  (Isnomia)బాధ పడుతున్నారని వెల్లడించింది. అంతే కాదు. ఈ వ్యాధి ముదిరిపోయిందనీ స్పష్టం చేసింది. నికోటిన్, ఆల్కహాల్ తీసుకుంటే తప్ప కంటినిండా నిద్ర పోయేందుకే వీల్లేకుండా పోయిందని తెలిపింది. Bloomberg రిపోర్ట్ ఈ సంచలన విషయాలు చెప్పింది. National Intelligence Service (NIS) ఆధారాల ప్రకారం చూస్తే...నార్త్ కొరియాకు చెందిన అధికారులందరూ కిమ్‌ జబ్బుని నయం చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌పర్ట్స్‌కి కాల్ చేసి మెడికేషన్‌ సలహాలు తీసుకుంటున్నారట. ఈ మధ్యే నార్త్ కొరియా భారీ మొత్తంలో ఫారిన్ సిగరెట్స్‌ని దిగుమతి చేసుకుంది. వాటితో పాటు ఆల్కహాల్‌నీ భారీగానే ఇంపోర్ట్ చేసుకున్నట్టు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఈ జబ్బు కారణంగా కిమ్‌ బరువు కూడా పెరిగారని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బరువు 140 కిలోల పైనే. నిద్ర పట్టక నికోటిన్ ఎక్కువగా ఉన్న సిగరెట్‌లను తెగ కాల్చుతున్నారట కిమ్. అయినా...సమస్య తీరడం లేదట. ఆయన కళ్లు కింద డార్క్ సర్కిల్స్ కూడా వచ్చాయని అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు చెప్పారు. ప్రస్తుతానికి ఆయన మందులకూ బాగానే ఖర్చువుతోందని తెలుస్తోంది. 


చైన్ స్మోకర్..? 


ప్రపంచంలోనే అతి పెద్ద టొబాకో కంపెనీల్లో ఒకటైన British-American Tobacco Company (BATC) చేసిన పనితో అమెరికా బాగా హర్ట్ అయింది. ఇంతకీ ఈ కంపెనీ చేసిన పనేంటో తెలుసా..? నార్త్ కొరియాకు సిగరెట్లు అమ్మింది. సబ్సిడీకే ఉత్తర కొరియాకు సిగరెట్‌లు విక్రయించింది. నిబంధనలు ఉల్లంఘించి మరీ అక్రమంగా వీటిని అమ్మడంపై అమెరికా ఫైర్ అయింది. ఈ కంపెనీకి, ఉత్తర కొరియాకి మధ్య ఓ డీల్ కూడా కుదిరింది. 2007-17 మధ్య కాలంలో సిగరెట్‌లు విక్రయించే ఒప్పందం చేసుకున్నారు. అయితే..నార్త్ కొరియన్ సంస్థలకు సిగరెట్‌లు అమ్మేందుకు రూల్స్‌ కూడా మార్చేశారని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా ప్రభుత్వం పెట్టిన రూల్స్‌ని ఉల్లంఘించి మరీ ఉత్తర కొరియాకు రూ.35 వేల కోట్ల రూపాయల విలువ చేసే సిగరెట్‌లు విక్రయించినట్టు తేలింది. బ్రిటీష్ అమెరికన్ టొబాకో కంపెనీ తీరుపై మండిపడ్డ అమెరికా భారీ జరిమానా విధించింది. రూ.52 వేల కోట్లు ఫైన్ వేసింది. ముగ్గురు నార్త్ కొరియన్ బ్యాంకర్‌లపైనా క్రిమినల్ ఛార్జ్‌లు వేసింది. ప్రస్తుతానికి ఈ ముగ్గురూ పరారీలో ఉన్నారు. ఇంత స్కామ్ చేసింది ఎందుకంటే...కిమ్‌కి బ్రిటీష్ అమెరికన్ టొబాకో కంపెనీ తయారు చేసే సిగరెట్‌లు అంటే చాలా ఇష్టం. స్మోకింగ్ అలవాటున్న కిమ్ చాలా సందర్భాల్లో సిగరెట్‌లు తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.


Also Read: Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్