Kim Jong Un look-alike: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్స్‌ ఎంత ఉత్కంఠగా జరిగాయో అందరికీ తెలుసు. ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలుపొందింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రపంచ దేశాల నుంచి పలువురు సెలబ్రెటీలు, నాయకులు ఖతార్‌ వచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కూడా ఈ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చారు.. అదేంటి అనుకుంటున్నారా? స్టేడియం దగ్గర కిమ్ జోంగ్ ఉన్‌ను చూసి అంతా షాకయ్యారు. అయితే అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.


కిమ్ లా!


ఈ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లానే ఉన్నాడు. లూసెయిల్ స్టేడియం ద‌గ్గ‌ర్లోని ఫ్యాన్ ఫెస్టివ‌ల్ ద‌గ్గ‌ర ఉన్న‌ అతడ్ని ఫొటోగ్రాఫ‌ర్స్ చుట్టుముట్టారు. ఆ వ్య‌క్తి పేరు హొవార్డ్ ఎక్స్‌. చైనా మూలాలు ఉన్న ఆస్ట్రేలియా పౌరుడు. ఖ‌తార్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ త‌న‌కు ఆనందాన్ని పంచింద‌ని హొవార్డ్ తెలిపాడు.






గ‌తంలో బ్రెజిల్, ర‌ష్యా ఆతిథ్యం ఇచ్చిన ఫిఫా వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌కు తాను హాజ‌ర‌య్యాన‌ని చెప్పుకొచ్చాడు. అంతేకాదు "2030లో ఉత్త‌ర‌కొరియాలో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణకు లాబీయింగ్ చేయడానికి వ‌చ్చాను" అంటూ ఇటీవల అతను ఒక వీడియో విడుద‌ల చేశాడు.






అప్పుడప్పుడూ


హొవార్డ్ వృత్తిరీత్యా సంగీత ద‌ర్శ‌కుడు. అయితే ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడిలాగా ఉండ‌డంతో అప్పుడప్పుడూ ఆయన్ను అనుక‌రిస్తూ ఉంటాడు. అలాగ‌ని కిమ్.. గురించి గొప్ప‌గా చెప్ప‌డం అత‌ని ఉద్దేశం కాదు. కిమ్‌ను విమ‌ర్శిస్తూ, వ్యంగ్యంగా జోకులు వేసేందుకే కిమ్‌ను ఇమిటేట్ చేస్తాన‌ని హొవార్డ్ వెల్ల‌డించాడు.


Also Read: Bilawal Bhutto Row: మోదీకి భయపడేది లేదు- ఏం కావాలన్నా చేసుకోండి: పాక్ విదేశాంగ మంత్రి