ABP  WhatsApp

Bilawal Bhutto Row: మోదీకి భయపడేది లేదు- ఏం కావాలన్నా చేసుకోండి: పాక్ విదేశాంగ మంత్రి

ABP Desam Updated at: 19 Dec 2022 10:53 AM (IST)
Edited By: Murali Krishna

Bilawal Bhutto Row: తనకు వ్యతిరేకంగా భాజపా చేపట్టిన నిరసనలపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి

NEXT PREV

Bilawal Bhutto Row: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి వ్యతిరేకంగా శనివారం భారత్ వ్యాప్తంగా భాజపా నిరసనలు చేపట్టింది. ఈ ఆందోళనలపై  భుట్టో తాజాగా స్పందించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేదా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కి భయపడనని ఆయన అన్నారు.



ఈ నిరసనల ఉద్దేశం పాకిస్థాన్‌ను భయపెట్టడమే అయితే.. అది పని చేయదు. ఆర్‌ఎస్‌ఎస్‌కు మేం భయపడం. మోదీకి కూడా మేం భయపడం. భాజపాకు అసలు భయపడం. వారు నిరసనలు చేయాలనుకుంటే.. చేసుకోవచ్చు.                                                  -   బిలావల్ భుట్టో జర్దారీ, పాక్ విదేశాంగ మంత్రి





ప్రధాని మోదీపై భుట్టో వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భాజపా వివిధ రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఆయన దిష్టిబొమ్మను దహనం చేసింది. 

 

భారీ నిరసనలు

 

పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై భారత్‌ భగ్గుమంది. దాయాది దేశం క్షమాపణలు చెప్పాల్సిందేనని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. బిన్ లాడెన్‌ను అమరవీరుడని కీర్తించిన పాక్‌.. లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాక్‌.. భారత్‌ను చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని మండిపడింది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను విదేశాంగ శాఖ గట్టిగా తిప్పికొట్టింది.



బిలావల్ వ్యాఖ్యలు పాకిస్థాన్ స్థాయిని మరింత దిగజార్చాయి. వాళ్ల దేశంలోని ఉగ్రదాడుల సూత్రధారులను ఉద్దేశించి పాక్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండేది. మరే దేశంలో లేని విధంగా పాకిస్థాన్ లో 126 మంది ప్రపంచస్థాయి ఉగ్రవాదులు, ఐరాస నిషేధిత 27 ఉగ్రసంస్థలు ఉన్నాయి. ఉగ్రవాదులను ప్రోత్సహించటం, వారికి ఆశ్రయం ఇవ్వటం, ఆర్థికసాయం అందిస్తున్న పాక్‌పై అంతర్జాతీయ నిఘా ఉంది. -                       భారత విదేశాంగ శాఖ


నిరసనలు


బిలావల్ భుట్టో వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు శనివారం ఆందోళనకు దిగాయి. కోల్‌కతా, రాంచీ, పుణె, దిల్లీ, గోరఖ్​పుర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. పుణెలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... దాయాది దేశం జాతీయ జెండాలను దహనం చేశారు. ఈ ఆందోళనల్లో పలువురు భాజపా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీని కించపరచే వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కమలం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బిలావల్‌ దిష్టిబొమ్మను దహనం చేసి పాకిస్థాన్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు.


Also Read: Year Ender 2022: 2022లో బాగా గుర్తుండిపోయిన సంఘటనలివే, మొదటి రోజే విషాదం





Published at: 19 Dec 2022 10:36 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.