Khalistani Indians Clash:


వందలాది మంది గుమిగూడి..


కెనడాలో దీపావళి వేడుకలు అలజడి సృష్టించాయి. మిస్సిసౌగా సిటీలో 400-500 మంది మధ్య తీవ్ర స్థాయిలో ఒకే చోట గుమిగూడి పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ వర్గం భారత జాతీయ జెండాతో నినాదాలు చేయగా...మరో వర్గం ఖలిస్థాన్ జెండా పట్టుకుని నినదించారు. ఈ రెండు వర్గాలు ఎదురుపడటం వల్ల అక్కడ అలజడి రేగింది. మొదట ఈ రెండు వర్గాలు కొట్టుకున్నట్టు  వార్తలు వచ్చినా... పోలీసులు వాటిని ఖండించారు. రెండు వర్గాలు ఎదురు పడి గట్టిగా నినదించారని, అంతకు మించి ఎలాంటి భౌతిక దాడులు జరగలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. Peel Regional Police అధికారులు...ఈ రెండు వర్గాలను వేరు చేసి అక్కడే నిఘా ఉంచారు. ఈ రెండు వర్గాలు అక్కడే దీపావళి వేడుకలు చేసుకున్నాయి.