ఇక్కడ ఇన్నోవా హైక్రాస్, అక్కడ ఇన్నోవా జెన్సిక్స్


దాదాపు రెండు దశాబ్దాలుగా టయోటా ఇన్నోవా భారతీయ వినియోగదారులకు సుపరిచితం. మల్టీ పర్సన్ వాహనాల విషయంలో అత్యంత విశ్వసతనీయతను కలిగి ఉంది. ఇప్పటికే టయోటా ఇన్నోవా మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రెండోతరం అమ్మకాల నుంచి మూడో తరం అవతార్ వైపు కంపెనీ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే తాజా వాహనానికి సంబంధించిన టీజర్ ఇమేజ్ను విడుదల చేసింది. త్వరలో లాంచ్ కాబోయే ఈ కారు భారతీయ మార్కెట్లో టొయోటా ఇన్నోవా హైక్రాస్ గా నామకరణం చేసే అవకాశం ఉంది.  అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఈకారును టయోటా ఇన్నోవా జెన్సిక్స్ గా పరిచయం కానుంది. లేటెస్ట్ హంగులతో పాటు అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది.


Also Read: వారెవ్వా, ఓలా ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ లుక్ అదుర్స్ - ఎప్పుడు లాంచ్ కానుందో తెలుసా?


ఇకపై డీజిల్ ఇంజిన్ ఉండదు


ఇక ఈ థర్డ్ జెనరేషన్ ఇన్నోవా కారు ఇండోనేషియాలో ఆవిష్కరణ జరుపుకోనుంది. నవీకరించబడిన MPV TNGA-C ఆర్కిటెక్చర్ ద్వారా ఈ కారు రూపొందింది. ఇన్నోవా హైక్రాస్ FWD లేఅవుట్‌ ను కలిగి ఉంటుంది. రెండు పవర్‌ ట్రెయిన్ ఎంపికలు ఉంటాయి. అయితే, ఈ రెండూ పెట్రోల్ పవర్ ప్లాంట్స్ గా ఉంటాయి.  రాబోయే తరం టయోటా ఇన్నోవా  ఇకపై D4D డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉండదు. ఇన్నోవా హైక్రాస్  హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ద్వారా శక్తిని పొందనుంది. ఇది అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.   


హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌తో విక్రయం


తాజాగా విడుదలైన టీజర్ లో MPVకి సంబంధిన నోస్ ను రివీల్ చేసింది.  బ్లాక్-అవుట్ థీమ్‌ తో ఫినిష్ చేయబడిన హెక్జాగోనల్ గ్రిల్‌  దర్శనం ఇస్తుంది. అంతేకాకుండా, ఒక జత స్లిమ్, ట్విన్-బ్యారెల్ హెడ్‌ల్యాంప్‌లను కూడా ఇందులో చూడవచ్చు. ఈ కారు నోస్ షార్ప్ గా కనిపిస్తుంది. కొత్త-తరం ఇన్నోవా MPV-విలక్షణమైన సిల్హౌట్‌ను కలిగి ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్‌ లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పునరుద్ధరించబడిన సైడ్ ప్రొఫైల్, టెయిల్ సెక్షన్‌ తో పాటుగా కనిపిస్తుంది. వాస్తవానికి, కొత్త తరం మోడల్ ఫీచర్లు లాంగర్ లిస్టుతో వస్తున్నాయి. ఈ కొత్త MPV హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌తో విక్రయించబడుతుంది.