Arif Mohammed Khan: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరోసారి తన చర్యలతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని ఆదేశించిన గవర్నర్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్‌ను తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తొలగించండి
విశ్వవిద్యాలయంలో ఇటీవల మంత్రి బాలగోపాల్ చేసిన వ్యాఖ్యలు విద్రోహపూరితంగా ఉన్నాయని గవర్నర్ ఆరోపించారు. దీంతో ఆర్థిక మంత్రి బాలగోపాల్‌ను కేబినెట్ నుంచి తొలగించాలంటూ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు.
సీఎం
కేరళలో 9 యూనివర్సిటీలకు చెందిన వీసీలు తక్షణమే రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సీఎం విజయన్ తప్పుబట్టారు.
" గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తనకు ఉన్న దాని కన్నా ఎక్కువ అధికారాలను వినియోగించుకోవడానికి ఛాన్సలర్ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. ఇది వీసీల అధికారాలను నియంత్రించడంగా మేం భావిస్తున్నాం. గవర్నర్ పదవి ఇచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి కాదు.. రాజ్యాంగం హుందాతనాన్ని కాపాడటానికి. "
- పినరయి విజయన్, కేరళ సీఎం
యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలో కేరళ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదంటూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని ఆదివారం ఆదేశించారు. సోమవారం ఉదయం 11:30 గంటల లోపల వీసీల రాజీనామాలు తన ముందు ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
Also Read: Ghaziabad Murder: పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం- ఇటుక బెడ్డతో దాడి, ఒకరు మృతి!