Air Hostess Gold Sumggling: కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఎయిర్‌హోస్టెస్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కడుపులో కిలో బంగారాన్ని దాచి పెట్టి స్మగుల్ చేస్తుండగా భద్రతా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఎయిర్‌ హోస్టెస్‌ సురభి ఖతున్ తన పెద్ద పేగులో 960 గ్రాముల బంగారాన్ని దాచుకుని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్టు  Directorate of Revenue Intelligence (DRI) వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తున్న సురభి మే 28వ తేదీన మస్కట్‌లో కనూర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. అక్కడే తనిఖీలు చేసి ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరవాత ఆమెని విచారించారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. 14 రోజుల పాటు పోలీసుల రిమాండ్‌కి కోర్టు అంగీకరించింది. ఆమెని కన్నూర్‌లోని మహిళల జైల్‌లో ఉంచనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎయిర్‌లైన్‌ సిబ్బంది గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం భారత్‌లో ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ మొదలు పెట్టారు. గతంలోనూ ఆమె చాలా సార్లు ఇలాగే బంగారాన్ని స్మగుల్ చేసినట్టు తెలుస్తోంది. స్మగ్లింగ్ గ్యాంగ్‌తో ఆమెకి ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ ఘటనపై Air India Express స్పందించలేదు.