Kedarnath Yatra 2023:
ఏప్రిల్ 25న ముహూర్తం..
ఏప్రిల్ 25వ తేదీ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఏటా శీతాకాలంలో ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. ఆ సమయంలో ఆలయాన్ని మూసేస్తారు. చలికాలం ముగియగానే మళ్లీ తెరుస్తారు. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 6.30 నిముషాలకు ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని అధికారులు వెల్లడించారు. అంతకు ముందు తెల్లవారు జామున 4 గంటలకు ఓంకారేశ్వర్ ఆలయంలో మహాభిషేక పూజ నిర్వహిస్తారు. అర్చకులు గర్భగుడిలో అన్ని క్రతువులూ పూర్తి చేశాక ఆలయ తలుపులు తెరుస్తారు. ఉదయం 8.30 నిముషాలకు హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ తరవాత 9 గంటలకు ఆలయ పూజారులు పంచ్‌కేదార్ గడ్డిస్థల్ వద్ద పంచాంగం వినిపిస్తారు. ఆ రోజంతా భజనలు జరుగుతాయి. ఇక బద్రినాథ్ యాత్ర చేయాలనుకునే వారికీ కీలక సమాచారం ఇచ్చారు అధికారులు. ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 7.10 నిముషాలకు బద్రినాథ్ ధామ్‌ను తెరవనున్నారు. ఆరోజు వసంత పంచమి కావడం వల్ల ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.