గోవిందరాజులు, జ్ఞానంబ పిల్లలు పెట్టిన కొత్త బట్టలు కట్టుకొని వస్తారు. పెళ్లి కళ వచ్చేసిందని అందరూ సంతోషంగా ఉంటారు. ఇద్దరికీ మళ్ళీ పెళ్లి చేయాలని జానకి అంటుంది. ఎందుకు ఈ ఏర్పాట్లు అని జ్ఞానంబ అంటుంది. పెళ్లి రోజుని కూడా పెళ్లిలా చేయాలంటే ఎలా అని గోవిందరాజులు అంటాడు. జ్ఞానంబ దంపతులు ఇద్దరూ దండలు మార్చుకుంటారు. కొత్తపెళ్ళికొడుకు పెళ్లికూతురిలా ఇద్దరికీ బుగ్గన చుక్క పెట్టేసరికి జ్ఞానంబ సిగ్గుపడుతుంది. అత్తయ్య సిగ్గు పడుతుంటే ఎంత బాగుందో అని జానకి, జెస్సి అంటారు. అందరూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అదంతా చూసి జ్ఞానంబ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మీరు మా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే భగవంతుడు ఇచ్చిన వందేళ్లు కాదు మరొక వందేళ్లు బతకాలని అనిపిస్తుందని ఎమోషనల్ అవుతుంది.
Also Read: నిజం చెప్పేసిన కృష్ణమూర్తి- కనకం మీద అనుమానపడిన రాజ్ తల్లి
వామ్మో మరొక వందేళ్ల అంటే రెండొందల ఏళ్లు ఈ ఇంట్లోనే ఉండాలా తన వల్ల కాదని మల్లిక మనసులో అనుకుంటుంది. భార్యాభర్తలు అంటే మెడలో మూడు ముళ్ళు పడేవరకు ఇద్దరు అది పడిన తర్వాత ఒక్కరుగా ఉండాలి. కష్టం అయిన సుఖమైన కలిసే పంచుకోవాలి. ఇద్దరితో మొదలయ్యే ఆ ప్రయాణం ముగ్గురు నలుగురై తరాలు మారుతూ ఆ వంశం వృక్షమై కాయలు కాస్తుంటే రాలే కాయలు రాలిపోతూ ఉంటాయి. కానీ ఉన్న వాళ్ళు ఉన్నంత వరకు ఒకటిగా ఉండాలి. వంశ గౌరవాన్ని కాపాడుకోవాలి. విడిపోవడం అంటే మన నౌక మనమే విరగ్గొట్టుకోవడం అని జ్ఞానంబ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. బతుకులోనే కాదు చావులోనూ కలిసే ఉంటానని గోవిందరాజులు భార్యకి మాట ఇస్తాడు.
మీరు ఎప్పుడు ఇలాగే పార్వతీ పరమేశ్వరుల్లగా కలిసి ఉండాలని జానకి కోరుకుంటుంది. పెళ్లి రోజు సందర్భంగా ఇంటికి ప్రత్యేక అతిథి రాబోతున్నాడాని రామ చెప్తాడు. తిలోత్తమ పిన్ని అనగానే ఆమె ఎంట్రీ ఇస్తాడు. గోవిందరాజులు కాసేపు కుర్రోడిగా మారి ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు. ‘అరే ఏమైంది..’ అంటూ సాంగ్ వేసుకుంటాడు. అప్పుడు ఇప్పుడు అదే పాటా అని జ్ఞానంబ కౌంటర్ వేస్తుంది. ఏంటి రాజా అని తిలోత్తమ గోవిందరాజులని పిలిచే సరికి కోడళ్ళు నోరెళ్ళబెడతారు. వచ్చిన ఆవిడ మల్లికని చూసి భలే ముచ్చటగా ఉందని అంటుంది. తిలోత్తమ తన పిన్ని కూతురని చెప్పి జ్ఞానంబ పరిచయం చేస్తుంది. పెళ్లి అంటే పూనకాలు రావాలి కానీ బంతి భోజనాలకు వచ్చినట్టు ఏంటి ఇదని అంటాడు.
Also Read: తులసి వల్లే కెఫ్ మూతపడుతుందని అవమానించిన లాస్య- సంబరంలో గాయత్రి
మల్లిక, విష్ణు దంపతులు డాన్స్ లు వేస్తూ అదరగొట్టేస్తారు. ఆట పాటలు డాన్స్ లతో ఎంజాయ్ చేస్తారు. తిలోత్తమ, గోవిందరాజులు ప్రేమ కథ గురించి రామ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. గోవిందరాజులు దంపతులు డాన్స్ వేసి మురిపిస్తారు. అందరికీ తిలోత్తమ ప్రేమగా వడ్డిస్తుంది. కాసేపు గోవిందరాజులతో సరదాగా మాట్లాడుతుంది. వెన్నెల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. పెళ్లి రోజుకే ఐదు వేలు వసులు చేశారు ఇక పెళ్లి అంతే ఎంత వసూలు చేస్తారో ఏంటో ఆ లోపు ఇంట్లో నుంచి బయట పడాలని మల్లిక మనసులో అనుకుంటుంది.