Mangaluru Man Stabbed: కర్ణాటకలో మరో దారుణ హత్య- ముస్లిం యువకుడ్ని పొడిచి చంపిన దుండగులు!

ABP Desam   |  Murali Krishna   |  29 Jul 2022 12:07 PM (IST)

Mangaluru Man Stabbed: కర్ణాటకలో ఓ ముస్లిం యువకుడ్ని గుర్తి తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

(Image Source: ANI)

Mangaluru Man Stabbed: కర్ణాటకలో భాజపా యువ నేత హత్య మరువక ముందే మరో దారుణ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం మంగళూరులోని ఓ ముస్లిం యువకుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశారు.

ఇదీ జరిగింది

సురత్కల్‌లో అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు కారులో వచ్చిన దుండగులు దూసుకొచ్చారు. భయంతో అక్కడి నుంచి బాధితుడు పరుగులు తీశాడు. అయినా కర్రలతో, కత్తులతో అతనిపై దాడికి పాల్పడ్డారు. దాడి చేసి పారిపోయిన వెంటనే బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తొలుత పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ అతను మరణించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఈ దాడి ఘటన రికార్డు అయింది.

144 సెక్షన్

ఘటన తర్వాత సురత్కల్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 144 సెక్షన్‌ విధించి జనాల్ని గుమిగూడకుండా చూస్తున్నారు. బాధితుడిని 25 ఏళ్ల ఫాజిల్‌గా గుర్తించారు. దీంతో మత కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.  

సీఎం సీరియస్

ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై సీరియస్‌గా తీసుకున్నారు. వీలైనంత త్వరగా ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామన్నారు.

మాకు ఎవరి ప్రాణాలైనా సమానమే. ఈ మధ్య జరిగిన మూడు హత్య కేసుల్లోనూ సరైన సమయంలో కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టానికి అనుగుణంగా యూపీ మోడల్ లేదా కర్ణాటక మోడల్‌లో తీవ్రమైన చర్యలు తీసుకుంటాం.                                                 - బసవరాజ్ బొమ్మై కర్ణాటక సీఎం

Also Read: Corona Cases: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కేసులు- కొత్తగా 20 వేల మందికి వైరస్

Also Read: International Tiger Day 2022: పులులు కూడా ఇంట్రావర్ట్‌లేనట - వాటి గంభీరం, గాండ్రింపు అంతా పైపైకే

Published at: 29 Jul 2022 11:51 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.