Interesting Facts About Tigers: 


జీవవైవిధ్యం కాపాడటంలో పులులదే కీలక పాత్ర. వాటికి తెలియకుండానే అడవిని రక్షిస్తుంటాయి. మొక్కలను తినే జీవ జాతులను పులులు చంపి తినకపోతే అడవి అనేదే మిగలదు. అంటే...సాదు జంతువులను వేటాడుతూ...ఇకో సిస్టమ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి పులులు. అయితే రానురాను అడువులు ధ్వంసం అవుతుండటం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతోంది. అవి మనుగడ సాగించేందుకు అవసరమైన అనుకూల వాతావరణం ఉండటం లేదు. క్రమంగా ఇవి అంతరించిపోయే ప్రమాదముందని గుర్తించిన ప్రపంచ దేశాలు, ఏటా జులై 19న అంతర్జాచతీయ పులుల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించాయి. వాటి ఉనికిని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవటంతో పాటు, వాటి సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా పులులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 


పులులు-ఆసక్తికర విషయాలు


1. పులిని  బిగ్‌ క్యాట్‌ అని కూడా పిలుస్తారు. ఈ బిగ్ క్యాట్ జీవ జాతిలో అతి పెద్దది పులి. పెద్ద పులుల బరువు అంటే పదేళ్ల వయసుండే పులి బరువు 363 కిలోలు ఉంటుంది. తోక నుంచి తల వరకూ 11 అడుగులు పొడవు ఉంటుంది. భారత్‌లోని బెంగాల్‌ టైగర్‌ బరువు 250 కిలోలు. పొడవు 10 అడుగులు. 


2. అన్ని పులుల గాండ్రింపు ఒకేలా ఉండదు. అవి ప్రత్యేకమైన సౌండ్స్‌తో కమ్యూనికేట్ అవుతుంటాయి. మన ఎమోషన్‌ని బట్టి మన మాట తీరు ఉన్నట్టే..పులులు కూడా తమ ఎమోషన్స్‌ని గాండ్రిస్తుంటాయి. అవి వాటి అరుపుతోనే భయాన్ని, ప్రేమని, ఆధిపత్యాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. పులులు వాటి చెవులను కదుపుతూ చుట్టు పక్కల శబ్దాలను గ్రహిస్తాయి. 


3. పులులు చెట్లు ఎక్కగలవు. కానీ...అవి చాలా అరుదుగా ఈ పని చేస్తుంటాయి. పులి పంజా చెట్టు ఎక్కి కొమ్మల్ని గట్టిగా పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ వాటి బరువు పెరుగుతుంది. ఆ సమయంలో చెట్టు ఎక్కినా, వాటి బరువుని అవి ఆపుకోలేవు. అందుకే వయసు పెరిగే కొద్ది చెట్లు ఎక్కడం తగ్గించేస్తాయి. అయితే కోతి పిల్లలను వేటాడే సమయంలో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో చెట్లు ఎక్కుతాయి. 


4. పులులకు నీళ్లంటే చాలా ఇష్టం. అందుకే కొలనులు, సరస్సుల్లో గంటల కొద్దీ గడుపుతాయి. మెడ వరకూ మునిగిపోయి జలకాలాడుతూ సేద తీరుతుంటాయి. 15-20 గ్యాలన్ల నీటిని తాగుతాయి. ఈత కొట్టడంలోనూ పులులు ది బెస్ట్. 


5. మనుషులు నైట్‌ విజన్‌తో పోల్చి చూస్తే..పులుల నైట్‌ విజన్ 5-6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మనుషుల రెటీనా వెనక ఉండే డార్క్‌ పిగ్మెంట్ సెల్స్ఎక్కువ వెలుతురుని గ్రహిస్తాయి. అదే పులుల విషయానికొస్తే...రెటీనా వెనక రిఫ్లెక్టివ్ టిష్యూ...రాత్రి పూట వాటి కళ్లు మరింత సమర్థంగా పని చేసేలా తోడ్పడుతుంది. 


6. వాసనను గ్రహించటం ద్వారా ఓ పులి మరో పులి ఎక్కడుందో కనిపెట్టేస్తుంది. చెట్లపైన పులికి సంబంధించిన స్రవాలు అలాగే ఉండిపోతాయి. ఆ పరిమళాన్ని గ్రహించి పులి ఎక్కడుందో సులువుగా కనిపెడతాయి. పెదవులను కదిలించటం, నాలుక బయట పెట్టడం ద్వారా వాసనను గ్రహిస్తాయి. 


7. పులుల సలైవాలో యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. వాటికేమైనా గాయమైతే నాలుకతో ఆ గాయాన్ని తరచూ నాకుతుంటాయి. ఆ సలైవాలోని లైసోజైమ్ ఎంజైమ్స్‌...గాయం మానేలా చేస్తాయి. 


8. పులులు అంత గంభీరంగా కనిపిస్తాయి కానీ..వాటికి సిగ్గెక్కువ. వేటాడే సమయంలో తప్ప ఎప్పుడూ బయటకు రావు. ఎప్పుడూ ఎక్కడో దాక్కుని ఉంటాయి. ప్రకృతిలో తిరిగేందుకు చాలా పెద్దగా ఇష్టపడవు. మనుషుల కంటపడకుండా తిరిగేందుకు ప్రయత్నిస్తుంటాయి. 


9. ఎక్కడైతే నివసిస్తున్నాయో అక్కడే దాచుకుంటాయి పులులు. ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడతాయి. 8-10 నెలల పాటు తోబుట్టువుతో కలిసి జీవించినా..ఆ తరవాత అవి వేరు పడతాయి. వాటికి నచ్చిన చోట, నచ్చిన విధంగా జీవలిస్తాయి.