Karnataka Protests:


బంజారా వర్గ ప్రజల డిమాండ్..


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బంజారా వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు శివమొగ్గలోని ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. యడియూరప్ప, సీఎం బసవరాజు బొమ్మై దిష్టి బొమ్మలు దహనం చేశారు. షెడ్యూల్ తెగల రిజర్వేషన్‌ కోటాలో మార్పులు చేసింది ప్రభుత్వం. ఈ మార్పులను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఒక్కసారిగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ అల్లర్లలో ఓ పోలీస్ గాయపడ్డారు. రిజర్వేషన్ కోటాలో మార్పులు అవసరం అంటూ కేంద్రానికి నివేదించింది కర్ణాటక ప్రభుత్వం. షెడ్యూల్ తెగలకు చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ల కోటా తగ్గించాలని ప్రతిపాదించింది. ఎస్‌సీ కమ్యూనిటీకి ప్రస్తుతం అందిస్తున్న 17% రిజర్వేషన్‌లలో లెఫ్ట్ షెడ్యూల్ కులాలకు 6%, రైట్ షెడ్యూల్ కులాలకు 5.5% రిజర్వేషన్‌లు కేటాయించింది. AJ సదాశివ కమిషన్ అందించిన రిపోర్ట్ ఆధారంగా కోటాలో మార్పులు చేర్పులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే...దీనిపై బంజారా వర్గ ప్రజలు మండి పడుతున్నారు. ఈ మార్పులు చేయడం వల్ల తమకు వచ్చే రిజర్వేషన్‌ల వాటా తగ్గిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.