Karnataka News:
9 మందిని అరెస్ట్ చేసిన బీదర్ పోలీసులు..
కర్ణాటకలోని బీదర్‌లో దసరా ఉత్సవాల్లో కలకలం రేగింది. కొందరు మదర్సాలోకి దూసుకెళ్లి అక్కడే పూజలు చేశారు. మహమూద్ గవాన్ మదర్సాలో ఈ ఘటన జరగ్గా...కర్ణాటక పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో పరోక్షంగా సంబంధం ఉన్న మరో నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. "బీదర్ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. వీళ్లు మదర్సాలోకి దూసుకెళ్లి దసరా పూజలు నిర్వహించారు" అని అడిషనల్ ఎస్‌పీ వెల్లడించారు. ఈ ఘటన తరవాత కొందరు ముస్లింలు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన చేపట్టారు. పరిస్థితులు అదుపు తప్పక ముందే పోలీసులు వచ్చి కంట్రోల్ చేశారు. మదర్సాలోకి వెళ్లడమే కాకుండా కొందరు అందులోనే కొబ్బరి కాయలు కొట్టి కావాలనే కొన్ని చోట్ల ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై మాత్రం పోలీసులు స్పందించలేదు. AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దీనిపై స్పందించారు. మదర్సాలోకి దూసుకెళ్తున్న వీడియోను షేర్ చేశారు. "కొందరు గేట్ తాళం పగలగొట్టి మరీ లోపలకు దూసుకెళ్లారు. ఇలాంటివి జరిగేంత అవకాశం ఎలా ఇస్తున్నారు..? కేవలం ముస్లింలను కించపరచటానికే..భాజపా ఇలా చేయిస్తోంది" అని ట్విటర్ వేదికగా మండి పడ్డారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు...9 మందిని అరెస్ట్ చేశారు. Archeological Survey of India (ASI)నిర్వహణలో ఉన్న ఈ మదర్సాను 1460ల్లో నిర్మించారు.
విదేశాల్లోని ఆలయాలపై దాడులు..
ఇక్కడ మదర్సాపై దాడి చేసిన నేపథ్యంలో..విదేశాల్లో ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయమూ చర్చకు వస్తోంది. కెనడాలోని BAPS స్వామినారాయణ్ మందిర్ వద్ద ఉన్న శిలాఫలకంపై గుర్తు తెలియన వ్యక్తులు "ఖలిస్థాన్ జిందాబాద్" అనే నినాదాలు రాశారు. అటు పక్కనే హిందుస్థాన్‌ను అనుమానించే విధంగా స్లోగన్స్ రాశారు. స్థానికంగా ఇది పెద్ద అలజడికి కారణమైంది. రాత్రికి రాత్రే వీటిపై ఎవరు రాశారన్న అంశంపై సరైన విచారణ జరపాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. టోర్నటోలో ఉన్న ఈ ఆలయం అక్కడ ఎంతో ప్రసిద్ధి. దీనిపై ఇండియన్ హై కమిషన్ (Indian High Commission) తీవ్రంగా స్పందించింది. ఆలయ ప్రతిష్ఠకు ఇలా మచ్చ తెచ్చిన వారెవరో కనుక్కో వాలని, నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులకు సూచించింది. దీనిపై పలువురు రాజకీయ నేతలూ స్పందించారు.
గతేడాది కూడా టోర్నటో ప్రాంతంలోని కొన్ని హిందూ ఆలయాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఇప్పటికే ఆరు ఆలయాల్లో ఇలాంటివి జరగ్గా... కొన్ని చోట్ల హుండీలను దొంగిలించారు. గతేడాది నవంబర్‌లో హిందూ సభ టెంపుల్, శ్రీ జగన్నాథ్ టెంపుల్‌పై ఇలాంటి దాడే జరిగింది. ఆ తరవాత ఈ ఏడాది జనవరిలో మా చింత్‌పూర్ణి మందిర్, హిందూ హెరిటేజ్ సెంటర్, గౌరీ శంకర్ మందిర్, హామిల్టన్ సమాజ్ టెంపుల్స్ కూడా దాడికి గురయ్యాయి.
Also Read: US President Joe Biden: వాళ్లకు సారీ చెప్పిన అమెరికా ప్రెసిడెంట్, ఎవరూ జైల్లో ఉండకూడదని ఆదేశాలు