Karnataka news: కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ నాటకాన్ని ప్రాక్టీస్ చేస్తూ 12 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. స్కూల్లో నాటకం వేయడానికి బాలుడు రిహార్సల్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది
చిత్రదుర్గ జిల్లా ఎస్‌ఎల్‌వీ పాఠశాలలో సంజయ్ గౌడ (12) ఏడో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో భగత్ సింగ్ నాటకం వేద్దామనుకున్నారు. భగత్ సింగ్ పాత్రను సంజయ్‌కు ఇచ్చారు.
నాటకం కోసం బాలుడు ఇంట్లో రిహార్సల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇందుకోసం ఇంట్లో రిహార్సల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ చిన్నారి మరణించాడు. ఇంట్లో పెద్ద వాళ్లంతా పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో చిన్నారి.. భగత్ సింగ్ ఉరి సన్నివేశాన్ని ప్రాక్టీస్ చేస్తూ నిజంగానే ఉరి వేసుకున్నాడు.
విగత జీవిగా
కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన తల్లిందండ్రులు ఉరి వేసుకుని కనిపించిన తమ కొడుకును చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: SC on Two Finger Test: అత్యాచార కేసుల్లో "టూ ఫింగర్ టెస్ట్"పై సుప్రీం బ్యాన్!