Karnataka: భోజనం చేశాక కాసేపు కునుకు తీయడానికి రిక్లైనర్లు - కర్ణాటక ఎమ్మెల్యేలకు స్పీకర్ బంపర్ ఆఫర్

Karnataka MLAs: కర్ణాటక ఎమ్మెల్యేలకు స్పీక్ర బంపర్ ఆఫర్ ఇచ్చారు. నిద్రపోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇలా చేయడం వల్ల డుమ్మా కొట్టే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతుందని అంటున్నారు.

Continues below advertisement

Karnataka MLAs to get recliners: సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పని మధ్యలో నిద్రపోవడానికి ఏర్పాట్లు చేస్తారని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఇప్పుడీ ఏర్పాటు కర్ణాటక అసెంబ్లీలోనూ చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ జరుగుతున్నప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత భుక్తాయాసంతో కాసేపు పడుకోవాలనుకునేవారి కోసం.. రిక్లైనర్లు ఏర్పాటు చేయాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు.

Continues below advertisement

కర్ణాటక శాసనసభలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సభ్యులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు గైర్హాజరు కాకుండా  ఆపడానికి ఈ ఏర్పాటు చేస్తున్నట్లుగా స్పీకర్ యుటి ఖాదర్ ప్రకటించారు. చాలా మంది ఎమ్మెల్యేలు మధ్యాహ్న భోజనం తర్వాత వెళ్లిపోతారు. అలాంటి వారిని ఆపి.. విశ్రాంతి అసెంబ్లీలోనే తీసుకునేలా చేసి.. తర్వాత సభా కార్యక్రమాల్లో పాల్గొనేలా మోటివేట్ చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే మార్చి 3 నుండి మార్చి 21 వరకు  రిక్లైనర్లను  అసెంబ్లీలో ఉంచుతామని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ మీడియాకు తెలిపారు.

ఇలా చేయడాన్ని తాము డబ్బును వృధాగా చేయడంగా భావించడం లేదని స్పీకర్ చెబుతున్నారు. రిక్లైనర్లను రెంట్ కు తీసుకుంటామని.. సమావేశం ముగిసిన వెంటనే తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారు.  సభ వెలుపల ఉన్న లాబీలో శాసనసభ్యుల సౌలభ్యం కోసం  వీటిని ఏర్పాటు చేయనున్నారు.  కర్ణాటక అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాలు  మార్చి 3న ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మార్చి 7న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.         

ఇటీవలి కాలంలో వివిద రాష్ట్రాల చట్టసభల్లో చర్చలు జరగడం గగనంగా మారింది. ఏదో ఓ విషయం మీద ఇతర పార్టీలు ఆందోళనలు చేయడం.. వాయిదాలు పడటం జరుగుతోంది. ఈ కారణంగా సభ్యుల హాజరు కూడా తగ్గిపోతోంది.కర్ణాటక అసెంబ్లీలో  లంచ్ బ్రేక్ తర్వాత సగం మంది ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్లిపోతున్నారు. అందుకే స్పీకర్ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఎంత వరకు సక్సెస్ అవుతుందో కానీ..అసెంబ్లీకి వచ్చి పండుకున్నారన్న ప్రచారం జరుగుతుందన్న భయంతో ఎమ్మెల్యేలు రిక్లైనర్లు వాడుకో రని అభావిస్తున్నారు. అయితే ఎవరు నిద్రపోవడానికి వెళ్లారన్నది బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.                

ఈ నిర్ణయంపై ప్రజల వైపు నుంచి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు నిద్రపోవడానికి అసెంబ్లీకి వెళ్లాలా అనే ప్రశ్నలు వస్తాయి.     

Also Read:  సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నో - రేప్ కేసు పెట్టిన యువతి - ప్రేమ వైఫల్యం నేరం కాదన్న కోర్టు !

Continues below advertisement