Karnataka govt announces KHIR city : తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మూసి ప్రక్షాళన ప్రాజెక్టుతో పాటు ఫోర్త్ సిటీని తన లక్ష్యంగా ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్,సైబరాబాద్ తర్వాత మరో సిటీని ఫోర్త్ సిటీగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మెడికల్ టూరిజం, ఏఐ సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇలా అనేక అంశాలతో ఆ ఫోర్త్ సిటీకి ఇప్పటికే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది . అయితే ఇంకా ఆ సిటీకి శంకుస్థాపన చేయలేదు. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం బెంగళూరుకు కాస్త దూరంగా మరో సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేస్తున్నారు. దానికి ఖిర్ సిటీ అని పేరు పెట్టారు.
కొత్త పెట్టుబడి అవకాశాలపై సిద్దరామయ్య ప్రభుత్వం దృష్టి
బెంగళూరు నగరం ఇరుకుగా మారిపోయింది. ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. అందుకే.. మరో కొత్త సిటీని సకల సౌకర్యాలతో అభివద్ధి చేయాలని సంకల్పించారు. KHIR అంటే నాలెడ్జ్, హెల్త్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సిటీ. అచ్చంగా రేవంత్ రెడ్డి కూడా ఇదే కాన్సెప్ట్ ను.. ఫోర్త్ సిటీకి అనుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులిద్దరూ ఇదే ప్లాన్ అనుకున్నా సిద్ధరామయ్య ముందుగా శంకుస్థాపన చేసేస్తున్నారు. గురువారం ఖిర్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సిటీ ద్వారా రూ. 40 వేల కోట్ల పెట్టబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే 80 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ప్రకటించారు.
ట్రంప్ మావయ్యను ఏసేస్తారా? ఎందుకురా ఇంత స్కెచ్చేశారు?
పెట్టుబడులకు కర్ణాటక గమ్య స్థానమన్న సిద్దరామయ్య ప్రభుత్వం
పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్‌తో కర్ణాటక జీడీపీని భారీగా వృద్ది చేస్తోందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.ఎలాంటి పెట్టుబడికైనా కర్ణాటక అత్యుత్తమ రాష్ట్రమని ఇప్పటికే నిరూపించామని గుర్తు చేస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్‌కు ఖిర్ సిటీని ఓ రోల్ మోడల్‌గా మారుస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఖిర్ సిటీ మోడరన్ లివింగ్ అండ్ వర్క్ స్పేస్‌కు ఓ మోడల్‌గా ఉండేలా డిజైన్ చేశారు. ఈ సిటీ ట్రాన్స్ పోర్టుకు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఖిర్ సిటీని ప్లాన్ చేశారు.
స్టార్టప్‌ల పొలాల్లో మళ్లీ మొలకలొస్తున్నాయ్ - 70 శాతం తగ్గిన లే ఆఫ్‌లు - ఇక రిక్రూట్‌మెంట్లు ?
రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు అంచనా వేస్తున్న ప్రభుత్వం
బెంగళూరు నుంచి కూడా యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది. దొడ్డబళ్లాపూర దగ్గర అంతర్జాతీయ ఆర్కిటెక్టులతో నగరాన్ని డిజైన్ చేశారు. ఈ సిటీ ద్వారా తాము అద్భుతమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నామని కర్ణాటక చెబుతోంది.తెలంగాణ కూడా ఇలాంటి సిటీ నిర్మిస్తోంది. ఇక ఏపీ కూడా అమరావతి పేరుతో కొత్త రాజధానిని కూడా అదే రేంజ్ లో నిర్మిస్తోంది. ఇలాంటి అర్బన్ ప్రాజెక్టుల వల్ల మేలే జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.