Sadomasochistic Tendencies : మహాలక్ష్మీ అనే మహిళను 30 ముక్కలుగా నరికాడు ఓ కిరాతక వ్యక్తి. బెంగుళూరు(Bengaluru Women Fridge Incident)లో జరిగిన ఈ ఘటన అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఈ కేసులో షాకింగ్ విషయాలు తేలాయి. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించగా.. వైద్య పరీక్షల్లో శరీరం 30 ముక్కలు కాదు యాభై ముక్కలు చేశారంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. వైద్యులు. ఒక్క తల భాగాన్నే మూడు ముక్కలుగా పగల గొట్టాడంటూ షాకింగ్ విషయాలు తెలిపారు.
హత్య చేసిన వ్యక్తి గురించిన కొన్ని విషయాలు కూడా వైద్యులు వెల్లడించారు. అతను సడోమా సూకిస్టిక్(Sadomasochistic) అనే రుగ్మతతో బాధపడుతున్నట్లు వారు గుర్తించారు. అయితే ఇదేమి జాలి పడాల్సిన విషయం కాదని.. ఇది శాడిజంతో నిండిన మానసిక చర్యగా తెలిపారు. ఈ సమస్య ఉన్నవారు ఓ వ్యక్తి శరీర భాగాన్ని నరికే సమయంలో ఎంతో ఆనందాన్ని పొందుతారంటూ బిత్తరగొలిపే విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా అతను నర రూప రాక్షసుడు కంటే డేంజర్ అంటూ వ్యైదులు తెలిపి.. అతనిని వీలైనంత తొందరగా అదుపులోకి తీసుకోవాలని సూచించారు.
సడోమా సూకిస్టిక్ అంటే ఏంటి?
వైద్య భాషలో చెప్పాలంటే ఇది లైంగికపరమైన మానసిక రుగ్మత. అంటే సడోమా సూకిస్టిక్‌తో ఉన్న వ్యక్తి మరో వ్యక్తిని శారీరకంగా, మాసికంగా ఇబ్బంది పెట్టి.. వారి బాధని చూసి ఆనందాన్ని పొందుతారట. వారు ఎంత బాధను అనుభవిస్తే.. అతనిలో సంతోషం అంత ఎక్కువ అవుతుందట. అయితే కొందరు నొప్పిని ఇవ్వడమే కాదు తీసుకోవడం వల్ల కూడా సంతృప్తిని పొందుతారట.
ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే..?
అయితే దీని గురించి తెలుసుకుంటుంటే.. ఫిష్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సినిమా తరహాలో ఉందేంటి అనిపించొచ్చు కానీ ఇది పూర్తిగా దానికి విరుద్ధం. ఎందుకంటే ఆ సినిమాలో ప్లెజర్ ద్వారా కలిగే ఆనందాన్ని చూపించారు. ఇది పూర్తిగా ఫాంటసీలలోకి వస్తుంది. కానీ సడోమా సూకిస్టిక్ ఉన్నవారిలో ఇది భిన్నంగా ఉంటుంది. ఇది ఓ మనిషిని చంపి.. వారిని ముక్కలుగా చేయడంలో కూడా వారు ఆనందాన్ని పొందగలుగుతారు. టెర్రిఫెయిర్ అనే మూవీ దీనికి కాస్త దగ్గరగా ఉంటుంది.
చిన్నతనం నుంచే..
నిజానికి ఈ లక్షణాలు చిన్నతనం నుంచే ఉంటాయట. బాల్యంలోని పరిస్థితులు, తర్వాత జరిగే అనుభవాలవల్ల సడోమాస్టోకిస్టిక్ లక్షణాలు ఎక్కువ అవుతాయట. ఇవి కాలక్రమేణా తమలోని రాక్షసుడిని గుర్తించేలా చేసి.. తమ ఆనందం కోసం ఎదుటివారిని ఏమిచేసినా పర్లేదు అనే స్టేజ్‌కి దిగజార్చుతాయి. ఈ సమస్య ఉన్నవారు పార్ట్నర్ని నమ్మించడం కోసం ఇతరులకు లొంగిపోతారు లేదా వారిపై అధికారాన్ని చూపిస్తారు. ఈ క్రమంలోనే బాధించడం, తరచూ లైంగిక వాంఛను తీర్చుకుంటూ అవతలి వారిని ఇబ్బందులకు గురిచేయడం వంటివి చేస్తారు. నొప్పిని కలిగించి లైంగికంగా సంతృప్తిని పొందుతారు.
నాలుగు రకాలు..
సడోమా సోకిస్టిక్ ఉన్నవారు ముందుగా అవతలి వ్యక్తిని అభ్యర్థిస్తూ శాడీజం చూపించడం ప్రారంభిస్తారు. తర్వాత వారి చర్యల్లో వైలెన్స్ యాడ్ అవుతుంది. అయితే వారు ఇతర పరిస్థితుల్లో అలా చేయరట. సాధారణ వ్యక్తిలానే బిహేవ్ చేస్తారట. ఇలా వైలెంట్‌గా బిహేవ్ చేశారనే విషయాన్ని కూడా వారు తీసుకోలేరట. వీరి పద్ధతులు చాలా రోటీన్‌కు భిన్నంగా ఉంటాయని ఓ అధ్యయనంలో తేల్చారు. ఇవి నాలుగు రకాలుగా ఉంటాయట. హైపర్ మాస్కులినిటీ, నొప్పిని కలిగించి-తీసుకోవడం, శారీరకంగా కొన్ని పరిమితులు, మానసికంగా అవమానపరచడం. ఇలా నాలుగు రకాలుగా వారు ఉంటారని అధ్యయనంలో తేలింది.
స్త్రీలు కూడా ఉంటారట
ఈ తరహా శాడిస్టిక్ బిహేవియర్ కేవలం పురుషులలోనే కాదు.. స్త్రీలలో కూడా ఉంటుందని కొన్ని సర్వేలు తెలిపాయి. అయితే ఈ తరహా శాడిస్టిక్ కోరికలు మగవారిలో చిన్ననాటి నుంచే అభివృద్ధి చెందుతాయట. పైగా ఒకరిని హింసిస్తున్నప్పుడు వారికి అది తప్పుగా ఉండదట. ఇలాంటివారిని ఆదిలోనే గుర్తించి వారిని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి కూడా ఫాంటసీలుగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Also Read : ఒంటరితనంతో ప్రాణాంతక సమస్యలు.. వామ్మో అంత డేంజరా?