Karnataka Election Results 2023: 


విద్వేష రాజకీయాల్ని తిప్పికొట్టారు: రాహుల్ 


కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు కనీసం 20 సీట్లు ఎక్కువగానే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 135 సీట్లకు పైగా లీడ్‌లో ఉంది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారీ మెజార్టీ ఇచ్చినందుకు కర్ణాటక ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్వేష రాజకీయాల్ని కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారని స్పష్టం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ...ఇది ప్రజల విజయం అని అన్నారు. 


"ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు నా కృతజ్ఞతలు. కష్టపడి పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు నా అభినందనలు. కర్ణాటకలో కాంగ్రెస్ పేద ప్రజలవైపు నిలబడింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే...ఈ సారి మేం ద్వేషంతో పోటీ చేయలేదు. ప్రేమతోనే పోటీ చేశాం. దేశ ప్రజలంతా ప్రేమ పూరిత రాజకీయాలనే కోరుకుంటున్నారని కర్ణాటక ప్రజలు నిరూపించారు. విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికారు. ప్రేమపూర్వక రాజకీయాలకే ఓటు వేశారు. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చుతాం. మొదటి రోజు నుంచే ఈ పని మొదలు పెడతాం"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత