Karnataka Election Results 2023: 


కర్ణాటకలో 21 రోజులు పర్యటన..


కర్ణాటక ఎన్నికలకు 7 నెలల ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) మొదలు పెట్టారు. ఎలక్షన్స్‌ని టార్గెట్ చేసుకున్న ఆయన కర్ణాటకలో దాదాపు 21 రోజుల పాటు పర్యటించారు. 2022 సెప్టెంబర్ 31వ తేదీ నుంచి అక్టోబర్ 19 వరకూ అక్కడే ఉన్నారు. మొత్తం 511 కిలోమీటర్ల మేర యాత్ర కవర్ చేశారు. 7 జిల్లాల్లో పర్యటించారు. చామరాజనగర్‌ నుంచి యాత్రను మొదలు పెట్టిన రాహుల్...ప్రజలతో మాట్లాడారు. ఇంటరాక్ట్ అయ్యే స్టైల్‌ని కూడా మార్చేశారు. ఈ యాత్రలో భాగంగా మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయ్‌చూర్ జిల్లాల్లో పర్యటించారు. ఆ తరవాత తెలంగాణలోకి ఎంటర్ అయ్యారు. ఈ 7 జిలాల్లో 51 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో దాదాపు 36 చోట్ల కాంగ్రెస్‌కు పాజిటివ్‌ ఫలితాలు వస్తాయని ట్రెండ్స్ స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే...రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర గట్టిగానే ప్రభావం చూపించిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ కూడా ఇదే అన్నారు. మైసూరులో 10 సీట్లున్నాయి. వీటిలో 7 స్థానాల్లో కాంగ్రెస్‌ పట్ల ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ కంచుకోట అయిన బళ్లారిలో 5 సీట్లుండగా..అన్ని చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరనుంది. రాయ్‌చూర్‌లోనూ దాదాపు ఇదే స్వింగ్ కనిపిస్తోంది. 



అనర్హతా వేటు కూడా కలిసొచ్చిందా..? 


జోడో యాత్ర పార్టీ పరంగానే కాకుండా...రాహుల్ పర్సనల్ ఇమేజ్‌కి కూడా మంచి బూస్టప్ ఇచ్చింది. అంతకు ముందు కాంగ్రెస్‌కి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించినా ఇప్పుడున్న ఫేమ్ అప్పుడు లేదు. సీనియర్లను పట్టించుకోలేదన్న విమర్శలూ అప్పట్లో ఎదుర్కొన్నారు రాహుల్. అసలు ఏ విషయంలోనూ బాధ్యత తీసుకోరు అన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక పార్టీ సంగతి సరే సరి. బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్ చేస్తూ దూసుకుపోతుంటే..కాంగ్రెస్ అన్నిచోట్లా ఓడిపోతూ వచ్చింది. అంతకంతకూ పార్టీ క్యాడర్‌ బలహీన పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్‌ యాక్టివ్ అయ్యారు. పార్టీని మళ్లీ ట్రాక్‌లో పెట్టే బాధ్యత తీసుకున్నారు. తనకున్న నెగటివ్ ఇమేజ్‌ని పోగొట్టుకోటానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ యాత్ర చేశారు. దీన్ని  బాగా ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్‌ని కూడా యాక్టివ్‌గా ఉంచారు. కాంగ్రెస్‌ని రాహుల్ కాపాడలేరు అన్న విమర్శలకు చెక్ పెడుతూ కొత్త ఆశలు రేకెత్తించారు. జోడో యాత్ర తరవాత రాహుల్ ఇమేజ్‌ని మరింత పెంచింది అనర్హత వేటు. 2019లో ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైంది. గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దీనిపై రాహుల్ బీజేపీతో డైరెక్ట్ ఫైట్‌ చేయడం మొదలు పెట్టారు. "నేను భయపడేదే లేదు" అని తేల్చి చెప్పారు. పైగా అదానీ వ్యవహారంపై పదేపదే ప్రశ్నించడమూ కొంత మేర విపక్షాల్లో ఐక్యతను తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ మాత్రం కచ్చితంగా రాహుల్‌కే ఇవ్వాలి. మొత్తానికి రాహుల్ వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు.  


Also Read: Karnataka Election Results 2023: కన్నడిగులు కాంగ్రెస్‌ని నమ్మడానికి కారణాలేంటి? ఆ హామీలే గెలిపించాయా?