నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే రణబీర్ కపూర్ తో ‘యానిమల్’, విక్కీ కౌశల్ తో కలిసి ‘ఛావా’ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు షాహిద్ కపూర్ తో జోడీ కట్టబోతోందని టాక్!
బాలీవుడ్ నుంచి రష్మికకు మరో క్రేజీ ఆఫర్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనీస్ బాజ్మీ, షాహిద్ కపూర్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఏక్తా కపూర్ కలిసి నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ మీద చర్చలు జరిగాయి. పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చినా, మేకర్స్ రష్మికకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. “ఈ సినిమాకు పలువురి పేర్లు పరిశీలించినా రష్మిక బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది. ఇప్పటికే ఏక్తా కపూర్, దిల్ రాజు రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశారు. వాటిలో ఒకటి ‘గుడ్‌బై’ కాగా మరొకటి ‘వారిసు’. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు రష్మిక బాగా సూట్ అవుతుందని భావిస్తున్నాము. అంతేకాదు, షాహిద్, రష్మిక ఆన్-స్క్రీన్ మీద చక్కగా అరించనున్నారు. ఈ జంట కారణంగా ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది” అని బాలీవుడ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
‘పుష్ప2’లో నటిస్తున్న రష్మిక మందన్న
ప్రస్తుతం రష్మిక మందన్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘పుష్ప’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’. దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల అద్భుత విజయాన్ని అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులో చేరింది. ఈ సినిమాలోని ‘సామి, రారా సామి’ అనే పాటతో రష్మిక ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. అమ్మడు అదిరిపోయే డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన పాటగా ‘శ్రీవల్లి’ నిలిచింది. ప్రస్తుతం ‘పుష్ప 2’లోనూ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తొలి భాగంతో పోల్చితే ఈ భాగంతో రష్మిక క్యారెక్టర్ మరింత అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ‘పుష్ప2’ విడుదలకు సిద్ధం అవుతోంది.
Also Read : 'కేరళ స్టోరీ'కి గోవా ముఖ్యమంత్రి మద్దతు - అందరూ చూడాలంటూ...
Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘కస్టడీ’ బోల్తా, ఫస్ట్ డే కలెక్షన్స్ అంతంత మాత్రమే!