Karnataka Election 2023: 



లేఖ రాసిన కాంగ్రెస్ 


కర్ణాటక ఎన్నికల్లో ఉపయోగించిన EVMలపై కాంగ్రెస్ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసింది. గతంలో సౌతాఫ్రికాలో వినియోగించిన వాటినే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని ఆరోపించింది. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతే కాదు. ఎన్నికల సంఘానికీ కంప్లెయింట్ చేసింది. కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాకు ఎన్నికల సంఘం లెటర్ రాసింది. Electronics Corporation of India Limited తయారు చేసిన ఈ EVMలను కేవలం కర్ణాటక ఎన్నికల కోసం మాత్రమే వినియోగించినట్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను కొట్టి పారేసింది. ఎన్నికల ముందే కాంగ్రెస్ మే 8వ తేదీన ఎన్నికల సంఘానికి ఈ ఆరోపణలు చేస్తూ లేఖ రాసింది. రీవ్యాలిడేషన్, రీవెరిఫికేషన్ లేకుండానే వాటిని కర్ణాటక ఎన్నికల్లో వాడేందుకు తీసుకొచ్చారని విమర్శించింది. 


"ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈవీఎమ్‌లను గతంలో సౌతాఫ్రికాలో వినియోగించారు. కొన్ని సోర్సెస్ ద్వారా మాకు ఈ సమాచారం అందింది. రీ వ్యాలిడేషన్, రీ వెరిఫికేషన్ అనేదే లేకుండా నేరుగా అక్కడి నుంచి తీసుకొచ్చారు. సాఫ్ట్‌వేర్‌లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాలి"


- కాంగ్రెస్ 


ఖండించిన ఈసీ


ఈ లేఖకు స్పందిస్తూ ఎన్నికల సంఘం లెటర్ రాసింది. కర్ణాటక ఎన్నికల్లో వినియోగించిన EVMల గురించి కాంగ్రెస్ నేతలకు అన్ని వివరాలూ తెలుసని తేల్చి చెప్పింది. సౌతాఫ్రికాకు ఇవే ఈవీఎమ్‌లు పంపారన్న ఆరోపణలనూ కొట్టిపారేసింది. కావాలంటే సౌతాఫ్రికా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వివరణ ఇచ్చింది. 


"ఈ ఈవీఎమ్‌లను సౌతాఫ్రికాలో వినియోగించారన్న ఆరోపణల్లో అర్థం లేదు. అసలు అలాంటి అవకాశమే లేదు. వీటిని కేవలం కర్ణాటక ఎన్నికల్లో వినియోగించడానికి మాత్రమే తయారు చేశాం. ఈ నిజం కాంగ్రెస్‌కు కూడా తెలుసు"


- ఎన్నికల సంఘం 


నగదు, మద్యం సీజ్..


ఎలక్షన్స్ అంటే లిక్కర్‌తో పాటు కరెన్సీ నోట్లకూ డిమాండ్ పెరుగుతుంది. ప్రచారానికి రావడం కోసం మందుని ఎరగా వేసి జన సమీకరణ చేస్తుంటాయి పార్టీలు. మాకే ఓటేయండి అంటూ డబ్బులు కూడా పంచుతాయి. ఇదంతా ఓపెన్ సీక్రెట్. అయితే...ఇలాంటి వాటిపై ఎన్నికల సంఘం నిత్యం నిఘా పెడుతూనే ఉంటుంది. అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీ చేసే వారిని పట్టుకుని వాటిని సీజ్ చేసేస్తుంది. అయితే..ఈ సారి కర్ణాటకలో సీజ్ చేసిన డబ్బుల విలువ పెరిగిపోయింది. ఎన్నికల ఖర్చుపై నిఘా పెట్టిన ఈ సంస్థ..కీలక విషయాలు వెల్లడించింది. 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే... ఈ సారి 4.5 రెట్లు ఎక్కువగా డబ్బుని సీజ్ చేసినట్టు స్పష్టం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు పలు చోట్ల ఈ నోట్ల కట్టల్ని సీజ్ చేశాయి. వీటి మొత్తం విలువ రూ.375 కోట్లుగా వెల్లడించింది. రూ.147 కోట్ల క్యాష్, రూ.84 కోట్ల విలువైన లిక్కర్, రూ.97 కోట్ల బంగారం వెండి, రూ.24 కోట్ల విలువైన డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. 


Also Read: మా సపోర్ట్ ఎవరికో ముందే డిసైడ్ అయిపోయింది, టైమ్ వచ్చినప్పుడు చెబుతాం - కుమారస్వామి