Karnataka Assembly Elections 2023:


రెండు పార్టీల సంప్రదింపులు..?


కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. రేపు (మే 13 వ తేదీన) ఫలితాలు వెల్లడవనున్నాయి. అధికారంపై అన్ని పార్టీలూ ధీమాగా ఉన్నాయి. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్‌కే మొగ్గు చూపుతున్నాయి. అయితే...కర్ణాటకలో ఎప్పుడూ కింగ్‌ మేకర్‌గా ఉండే పార్టీ జేడీఎస్. ఆ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే గద్దెనెక్కుతారు. కానీ...ఈ సారి మాత్రం కింగ్‌మేకర్‌ కాదు..తామే కింగ్ అంటున్నారు కుమారస్వామి. ఎన్నికల తరవాత మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండుపార్టీల నుంచి తమకు కాల్స్ వచ్చాయని చెప్పారు. హంగ్‌కు అవకాశముందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ అలెర్ట్ అయ్యాయి. ఈ మేరకు కుమారస్వామితో అప్పుడే మంతనాలు జరుపుతున్నట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఎన్నికలైన వెంటనే సింగపూర్‌కు వెళ్లిన ఆయన "ఎవరికి మద్దతునివ్వాలో ముందే డిసైడ్ అయ్యాం" అని తేల్చి చెప్పడం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. "ఏ పార్టీకి మద్దతునివ్వాలనేది ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. కరెక్ట్ టైమ్‌లో మా నిర్ణయం ఏంటో ప్రజలకు వెల్లడిస్తాం" అని స్పష్టం చేశారు కుమారస్వామి. 


కొట్టి పారేసిన బీజేపీ..


అయితే...ఈ కామెంట్స్‌పై బీజేపీ స్పందించింది. అలాంటిదేమీ లేదని కొట్టి పారేసింది. తాము ఎవరినీ సంప్రదించలేదని, స్పష్టమైన మెజార్టీ వస్తుందన్న నమ్మకముందని తేల్చి చెప్పింది. సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశమే లేదని, బీజేపీ మేజిక్ ఫిగర్ సాధిస్తుందని వెల్లడించింది. కనీసం 120 సీట్లు వస్తాయన్న ధీమాతో ఉంది. బీజేపీ కొట్టిపారేస్తున్నప్పటికీ..JDS మాత్రం బీజేపీ నేతలు కొందరు తమతో మాట్లాడారని చాలా గట్టిగా చెబుతోంది. ప్రజలకు మంచి చేస్తుందన్న నమ్మకమున్న పార్టీకే తమ ఫుల్ సపోర్ట్ ఉంటుందని జేడీఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ...ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది తామే డిసైడ్ చేస్తామన్న ధీమాతో ఉన్నారు. అసలు తాము లేకుండా ప్రభుత్వమే ఏర్పాటు కాదని గట్టిగానే చెబుతోంది జేడీఎస్. 


ఎగ్జిట్ పోల్స్‌లో ఏముంది..? 


జేడీఎస్ కు 23 నుంచి 35 సీట్లు వస్తాయని ఏబీపీ-సీ ఓటర్ సర్వే అంచనా వేయగా, కుమారస్వామి పార్టీకి 23 నుంచి 33 సీట్లు వస్తాయని మిగతా డేటా బట్టి తెలుస్తోంది.  లోక్ పోల్ లో 21 నుంచి 27 సీట్లు, పాపులర్ పోల్స్ ప్రకారం జేడీఎస్ కు 42 సీట్లకు గాను 45 సీట్లు వస్తాయి. కాబట్టి జేడీఎస్ కు 27 నుంచి 35 సీట్లు వస్తాయని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఒపీనియన్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఈ పార్టీ గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని అర్థమవుతోంది. ఈ ఒపీనియన్ పోల్ లో 24 వేల 759 మంది అభిప్రాయం తీసుకున్నారు. కర్ణాటకలోని అన్ని స్థానాల్లో ఒపీనియన్ పోల్ నిర్వహించారు. మైనస్ 3 నుంచి మైనస్ 5 శాతం వరకు తేడా ఉందని ఒపీనియన్ పోల్ లో తేలింది.


Also Read: పని చేయకపోతే తోకలు కత్తిరిస్తాం, ఇప్పటి నుంచి వేరే లెక్క - అధికారులకు కేజ్రీవాల్ వార్నింగ్