కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కేబినెట్‌ను నేడు విస్తరించారు. గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ రాజ్ భవన్‌లో 29 మంది కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్, మాజీ మంత్రులు ఆర్ అశోక, బీ శ్రీరాములు, ఈశ్వరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త కేబినెట్‌లో ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, 8 మంది లింగాయత్‌లు, ఏడుగురు వొక్కలిగలు, రెడ్డి వర్గానికి చెందిన ఒకరితోపాటు ఒక మహిళ ఉన్నారు.
డిప్యూటీ లేనట్లే..
ఈసారి డిప్యూటీ సీఎం పదవిని ఎవరికీ కేటాయించలేదు. డిప్యూటీ సీఎం పదవిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ భాజపా అధిష్ఠానం అసలు ఆ పదివికి ఎవరిని ప్రతిపాదించలేదు. మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్రకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కీలకమైన మైసూర్, కొడగు, బళ్లారి, హసన్, రామనగర, గుల్బర్గా, దావనగెరె, యాదగిరి, రాయచూర్, చిక్‌మంగళూర్, విజయపుర, చామరాజనగర్, కోలార్ జిల్లాల నుంచి ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు.
యడియూరప్ప కుమారుడు విజయేంద్రను కేబినెట్ లోకి తీసుకోకపోవడంపై కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యడియూరప్ప అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఏడుగురు మాజీ మంత్రులకు కొత్త కేబినెట్ లో చోటుదక్కలేదు. ఆ జాబితాలో జగదీశ్ షెట్టర్, సురేశ్ కుమార్, అరవింద్ లింబావలి, ఆర్ శంకర్, సీపీ యోగేశ్వర్, శ్రీమంత్ పాటిల్, లక్షణ్ సవాడీ ఉన్నారు.
కర్ణాటక కేబినెట్ జాబితా..
- గోవింద కరజోల్
- కేఎస్ ఈశ్వరప్ప
- ఆర్ అశోక
- బీ శ్రీరాములు
- వీ సోమన్న
- ఉమేశ్ కట్టి
- ఎస్ అంగారా
- జేసీ మధుస్వామి
- ఏ జ్ఞానేంద్ర
- అశ్వంత్ నారాయణ్
- సీసీ పాటిల్
- ఆనంద్ సింగ్
- కోటా శ్రీనివాస్
- ప్రభు చావన్
- మురుగేశ్ నిరాణి
- కే గోపాలయ్య
- బైరతి బసవరాజ్
- ఎస్టీ సోమశేఖర
- బీసీ పాటిల్
- కే సుధాకర్
- కేసీ నారాయణ గౌడ
- శివరామ హెబ్బర్
- ఎమ్ టీబీ నాగరాజ
- శశికళ జోలే
- వీ సునీల్ కుమార్
- హలప్ప ఆచార్
- శంకర్ పాటిల్ ముననకొప్ప
- బీసీ నగేశ్
- మునిరత్న