Karnataka bodybuilder bride: పెళ్లి వేడుకలకు అమ్మాయిలంతా అద్భుతంగా తయారవుతారు. పెళ్లి కూతురు అయితే చెప్పాల్సిన పనిలేదు. అందులో వింతేం లేదు. కానీ మారుతున్న కాలంతో పాటు అమ్మాయిలు మారుతున్నారు. సంప్రదాయాల్ని గౌరవిస్తూనే తమ అభిరుచుల్ని.. వృత్తిని.. ఇష్టమైన వ్యాపకాన్ని వదులుకోవడం లేదు. బెంగళూరుకు చెందిన చిత్ర అనే బాడీ బిల్డర్ పెళ్లిలో చేసిన కండల ప్రదర్శన ఇప్పుడు వైరల్ గా మారింది. 



కర్ణాటకకు చెందిన బాడీబిల్డర్ మ, రి ఫిట్‌నెస్ ట్రైనర్ చిత్రా పురుషోత్తం తన పెళ్లి వీడియోను సోష్ల్ మీడియాలో షేర్ చేశారు. సంప్రదాయాన్ని, తన  బలాన్ని కలిపి చూపించేలా  చిత్ర పురుషోత్తం  ఫోటో షూట్ చేశారు. పసుపు ,  నీలం రంగు కాంజీవరం చీరలో తన కండలు తిరిగిన శరీరాన్ని  చిత్రా పురుషోత్తం ప్రదర్శించారు.  ఆమె తన దుస్తులతో బ్లౌజ్‌ను పక్కనపెట్టి, కమర్ బంద్, మాంగ్ టిక్కా, చెవిపోగులు,  గాజులు వంటి సాంప్రదాయ బంగారు ఆభరణాలతో తన పెళ్లి లుక్‌ను వావ్ అనిపించారు.                                             



సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్లను కలిగి ఉన్న చిత్ర పురుషోత్తమ్, అనేక అందాల పోటీలలో పాల్గొని మిస్ ఇండియా ఫిట్‌నెస్, వెల్‌నెస్, మిస్ సౌత్ ఇండియా  మిస్ కర్ణాటక వంటి టైటిళ్లను గెలుచుకున్నారు. కొంత కాలంగా కిరణ్ రాజ్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నారు. పెళ్లిని వైభవంగా చేసుకున్నారు. 



చిత్రా పురుషోత్తం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరూ చిత్రా పురుషోత్తం, కిరణ్ రాజ్‌లను అభినందిస్తున్నారు.