Tamannaah Bhatia - Vijay Varma: తమన్నాతో బ్రేకప్ వార్తల తర్వాత విజయ్ వర్మ ఫస్ట్ పోస్ట్... అందులో ఏముందో తెలుసా?
Tamannaah Bhatia - Vijay Varma : గత రెండ్రోజుల నుంచి సెలబ్రిటీ లవ్ బర్డ్స్ విజయ్ వర్మ, తమన్నా బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ వర్మ తాజాగా ఓ పోస్ట్ ను షేర్ చేశారు.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, విజయ్ వర్మ మధ్య బ్రేకప్ జరిగిందని తెగ ప్రచారం జరుగుతోంది. విజయ్ వర్మ బ్రేకప్ వార్తల తర్వాత ఫస్ట్ టైం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ ను పంచుకున్నారు. అయితే అందులో బ్రేకప్ గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రస్తుతం విజయ వర్మ 'ఐఫా డిజిటల్ అవార్డు'లను హోస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన జైపూర్ లో ఉన్నారు. ఇక తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా ఆయన దీనికి సంబంధించిన అప్డేట్ ను పోస్ట్ చేశారు.
బ్రేకప్ వార్తల తర్వాత విజయ వర్మ ఫస్ట్ ఇన్‌స్టా పోస్ట్
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో విజయ వర్మ 'ఐఫా డిజిటల్ అవార్డు'లకు సంబంధించిన రిహార్సల్స్ గ్లిమ్స్ ను పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వరుస ఫోటోలను పోస్ట్ చేశాడు. 'హోస్ట్ మోడ్ ఆన్' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆయన 'ఐఫా డిజిటల్ అవార్డ్స్' గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు మరో పిక్ లో అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీలతో పాటు విజయ్ వర్మ కలిసి ఉండగా, దానికి 'పార్ట్నర్స్ ఇన్ రైమ్' అనే క్యాప్షన్ ఇచ్చారు.
Read Also : ఇద్దరమ్మాయిలతో మాస్ మహారాజా రొమాన్స్... సంక్రాంతి పండక్కి థియేటర్లలో వచ్చేస్తుందా?
తమన్నా - విజయ్ వర్మ బ్రేకప్ కు ఇదే కారణమా ?
తమన్నా - విజయ్ వర్మ విడిపోయారనే ఊహాగానాల మధ్య, వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏంటి ? అనే విషయంపై ఓ కొత్త రూమర్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ఉన్న తమన్నా తమ రిలేషన్షిప్ లో నెక్స్ట్ స్టెప్ చేయడానికి ఆసక్తిని చూపించిందని అంటున్నారు. ఇక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలని తమన్నా అనుకోవడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని టాక్ నడుస్తోంది. ఈ వివాదం కారణంగానే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని, అయితే విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారని వార్తలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరూ తమ షూటింగ్ షెడ్యూల్ తో బిజీబిజీగా ఉన్నారు. గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న బ్రేకప్ రూమర్లపై తమన్నా లేదా విజయ్ వర్మ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఈ జంట 2022లో కలిసి కనిపించడం ఫస్ట్ టైం డేటింగ్ పుకార్లకు దారి తీసింది. తర్వాత 2023 జూన్ లో ఇద్దరూ తమ రిలేషన్ ను అఫీషియల్ గా ప్రకటించారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో రూపొందిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్ 2'లో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని సమాచారం. ఇక ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా విజయవర్మతో రిలేషన్షిప్ గురించి వెల్లడించి, నెలలు తరబడి వచ్చిన రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అలాగే విజయ్ వర్మ సైతం తన భావాలను బోన్లో బంధించాలని అనుకోవట్లేదు అంటూ తమన్నాతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవడమే మిగిలింది అనుకుంటున్న తరుణంలో, బ్రేకప్ అయ్యిందనే వార్త తమన్నా, విజయ్ వర్మ అభిమానులకు షాక్ ఇచ్చింది.
Read Also : ఏప్రిల్‌లో 'టెస్ట్' రిలీజ్... డైరెక్టుగా ఓటీటీలోకి నయన్, సిద్ధార్థ్, మాధవన్ మూవీ, ఎప్పుడు చూడొచ్చంటే?