'దిల్ రూబా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిన్న ఇష్యూ జరిగింది. ఫోటోగ్రాఫర్స్ మీద హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ అసహనం వ్యక్తం చేశారు. స్టేజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఫోటోగ్రాఫర్లపై హీరోయిన్ ఫైర్ హీరోయిన్ రుక్సార్‌ థిల్లాన్‌ మాట్లాడుతూ "నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ముందుగా దీన్ని చెప్పాలా లేదా అని కాస్త భయపడ్డాను. కానీ ఇది అందరికీ తెలియడం ముఖ్యమని భావించాను. కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అమ్మాయిలందరూ ఫోటోలు తీసుకోవడం కామన్. అయితే ఎప్పుడైనా అన్ కంఫర్టబుల్ గా అనిపించే విధంగా ఎవరైనా ఫోటోలు తీసుకుంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా... నా 'దిల్‌రూబా' మూవీ గురించి నాకు చాలా లవ్ ఫీలింగ్ ఉంది. ఆ ప్రేమతో, రెస్పెక్ట్ తో అన్ కంఫర్టబుల్ గా ఉంది. అలా ఫోటోలు తీయొద్దు అని చెప్పాను. అలా చెప్పడం తప్పు కాదు కదా. స్టేట్ మీద ఏం జరుగుతుందో మీరందరూ చూశారు కదా... మేము గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఏం జరిగింది? నేను పేర్లు చెప్పాలనుకోవట్లేదు. కానీ ఈ మెసేజ్ ఎవరికి రీచ్ అవ్వాలో అయ్యింది. అది చాలు. నేను ఇంత రెస్పెక్ట్ తో, లవ్ తో చెప్పాను. అయినా కూడా స్టేజ్ పై జరిగింది మీరంతా చూశారు. థాంక్యూ" అంటూ సీరియస్ అయింది రుక్సార్. దీంతో హీరోయిన్ ఈ విధంగా ఓపెన్ గా మాట్లాడడం మంచి విషయం అంటున్నారు ఆమె అభిమానులు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Read: కింగ్స్టన్ ట్విట్టర్ రివ్యూ... జీవీ ప్రకాష్ ఫాంటసీ థ్రిల్లర్ గురించి నెటిజన్స్ ఏమంటున్నారంటే?

సిక్స్ ప్యాక్ పై కిరణ్ అబ్బవరం కామెంట్స్ ఇక ఇదే ఈవెంట్లో 'దిల్‌రూబా' సినిమాలో మీరు సిక్స్ ప్యాక్ చూపిస్తున్నారని వార్తలు వచ్చాయి. అందులో ఎంతవరకు నిజముంది? అనే ప్రశ్నకి కిరణ్ అబ్బవరం స్పందిస్తూ "లేదండి.. ఆ ప్యాక్ లు అంత ఈజీగా ఎక్కడ వస్తాయి? ఎక్కడో చిన్న మిస్ కమ్యూనికేషన్ అయినట్టుంది. సిక్స్ ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్ మ్యాన్ రోల్ చేస్తున్నాను. వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తున్నాను అని అన్నాను. సిక్స్ ప్యాక్ అనేది బహుశా నేను చెయ్యకపోవచ్చేమో. చేసిన వాళ్ళందరికీ హాట్సాఫ్" అని చెప్పుకొచ్చారు.

గత ఏడాది 'క' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ హీరో నటిస్తున్న కొత్త మూవీ 'దిల్‌రూబా'. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి విశ్వ కరుణ్‌ దర్శకత్వం వహించగా, కిరణ్‌ అబ్బవరం, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించారు. రవి, సారెగమ, జోజో జోస్, రాకేశ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'రేఖాచిత్రం' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా..?, మర్డర్ మిస్టరీ తెలుగులోనూ చూసేయండి!