సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా మారి చాలా రోజులు అయింది‌. కింగ్స్టన్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. దివ్యభారతి కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో శుక్రవారం మార్చి 7న విడుదల అవుతుంది. ముందుగా ప్రివ్యూ షో వేశారు‌. ప్రీమియర్లు చూసిన నెటిజనులు ఏమంటున్నారు? సినిమా ట్విట్టర్ టాక్ ఏమిటి? నెటిజన్స్ ఈ సినిమా గురించి చేసిన ట్వీట్స్ ఏమిటి? అనేది చూడండి. 

Continues below advertisement


స్టన్నింగ్ విజువల్ ట్రీట్.‌‌..
సాలిడ్ పెర్ఫార్మెన్స్... కింగ్స్టన్ కేక!
'కింగ్స్టన్' సినిమా చూసిన జనాలు అందులో విజువల్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే జీవి ప్రకాష్ కుమార్ నటనతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందట. హీరోగానూ ఆయన స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, స్మగ్లర్ పాత్రలో ఇరగదీసారని చెబుతున్నారు. కోలీవుడ్ నెటిజన్ ఒకరు సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చారు.


Also Read'జీ తెలుగు'ను డామినేట్ చేసిన 'స్టార్ మా'... మళ్లీ కార్తీక దీపమే టాప్.. టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... ఈ వారం లిస్టులో టాప్ 10 సీరియల్స్ ఏవో చూడండి



టెక్నికల్ పరంగా సినిమా సూపర్ ఉందని మరొక నెటిజన్ పేర్కొన్నారు. ఇటువంటి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి గట్స్ కావాలని జీవి ప్రకాష్ కుమార్ ను అభినందించారు. ఇంతకుముందు ఎప్పుడు తమిళ తెర మీద చూడనటువంటి ప్రయత్నం దర్శకుడు కమల్ ప్రకాష్ చేశారని తెలిపారు.


Also Read: పవన్ కళ్యాణ్... అల్లు అర్జున్... తెలుగు హీరోలతో పాటు ‘కింగ్స్టన్’ గురించి హీరోయిన్ దివ్యభారతి ఇంటర్వ్యూ


















సినిమా బాలేదని చెబుతున్న ఆడియన్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆసక్తికరంగా సాగినప్పటికీ ఇంటర్వెల్ తర్వాత బోరింగ్ ఎక్కువ అయిందన్నారు స్క్రీన్ ప్లే బాలేదని చెప్పారు. హీరోయిన్ దివ్యభారతి కమర్షియల్ సినిమాలో అందాల భామ కింద కనిపించారు తప్ప ఆవిడ పాత్రకు ప్రాముఖ్యత లేదన్నారు.