Karnataka Assembly Elections:


రాజీనామాకు రెడీ..! 


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీష్ షెట్టర్ పార్టీకి రాజీనామా చేశారు. హైకమాండ్ తీరుతో విసిగిపోయాయని, టికెట్‌ ఇవ్వకపోవడం బాధించిందని వెల్లడించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అయితే...స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా..? లేదంటే ఇంకేదైనా పార్టీ నుంచి బరిలోకి దిగుతారా అన్నది ఇంకా స్పష్టతనివ్వలేదు. 


"బీజేపీ హైకమాండ్ తీరు నన్ను చాలా బాధించింది. అందుకే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను. కొంత మంది లీడర్‌లు కర్ణాటకలోని బీజేపీని మిస్ హ్యాండిల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రిజైన్ చేసేస్తాను. ఆ తరవాతం ఏం చేయాలో త్వరలోనే నిర్ణయించుకుంటాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా..? వేరే పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలా అన్నది ఆలోచిస్తున్నాను"


- జగదీశ్ షెట్టర్, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే 






తనపై కుట్ర జరిగిందని త్వరలోనే అన్ని విషయాలూ వెల్లడిస్తానని చెప్పారు. ఇప్పటికే స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగెరీ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆయనకు రాజీనామా లేఖ అందించారు. 


"పార్టీని వీడటం మనసుకు భారంగా ఉంది. కర్ణాటకలో బీజేపీ బలం పుంజుకునేలా చేయడంలో కీలక పాత్ర పోషించాను. కానీ వాళ్లు మాత్రం నేను రాజీనామా చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. నన్నింకా పూర్తిగా అర్థం చేసుకోలేదు."


- జగదీశ్ షెట్టర్, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే 


యడియూరప్ప ఫైర్..


ఈ రాజీనామాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. ఇప్పటికే లక్ష్మణ్ సవది రిజైన్ చేయగా...ఇప్పుడు మరో కీలక నేత జగదీష్ కూడా పార్టీని వీడటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరినీ పార్టీ ఎప్పటికీ క్షమించదని తేల్చి చెప్పారు. హైకమాండ్‌ జగదీష్‌కి ఎన్నో ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ...వాటన్నింటినీ కాదనుకున్నట్టు సమాచారం. అంతకు మించి ఇంకేదో ఆశించారని, అందుకు పార్టీ అంగీకరించలేదని తెలుస్తోంది. టికెట్‌ ఎక్స్‌పెక్ట్ చేసిన కొందరు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, మంత్రి లక్ష్మణ్ సవది పార్టీని వీడారు. తనకు టికెట్ దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన లక్ష్మణ్...బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన ఒక్కరే కాదు. మరి కొంత మంది కూడా అసంతృప్తి నేతలున్నారని, వాళ్లు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు అత్యంత సన్నిహితుడైన లక్ష్మణ్ సవది పార్టీ నుంచి వెళ్లిపోవడం బీజేపీకి గట్టి షాకే ఇచ్చింది. లింగాయత్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన జనసమీకరణలోనూ ఆరితేరారు. అలాంటి వ్యక్తిం పార్టీ వీడడం వల్ల ఆ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశముంది. 


Also Read: Coronavirus Death: రెండేళ్ల క్రితం చనిపోయాడు, ఇప్పుడు ఉన్నట్టుండి ఊడిపడ్డాడు - ముచ్చెమటలు పట్టించే ట్విస్ట్ ఇది