Karnataka Assembly Election 2023: 


టఫ్ ఫైట్..


కర్ణాటకలో ఈ సారి ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ...ఈ సారి తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. ఒపీనియన్ పోల్స్ కూడా కాంగ్రెస్‌కి ఫేవర్‌గా ఉన్నాయి. మే 10వ తేదీన జరగనున్న ఈ ఎలక్షన్‌ ఫైట్‌లో కీలక అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో ముఖ్యమంత్రి అభ్యర్థులతో పాటు టఫ్ ఫైట్ ఇచ్చే నేతలూ ఉన్నారు. 


1. ఈ లిస్ట్‌లో కీలక అభ్యర్థి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడు సార్లు వరసగా గెలిచారు బొమ్మై. ఈ సారి కూడా విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో 9,260 ఓట్లతో గెలుపొందారు. నిజానికి బసవరాజు బొమ్మై జనతాదళ్‌తో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. 2008లో బీజేపీలో చేరారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2013,2018 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచారు. బీఎస్ యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బొమ్మై..2021లో సీఎం కుర్చీ కైవసం చేసుకున్నారు. 


2. హుబ్బళి ధార్వాడ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు జగదీష్ షెట్టర్. ఎన్నో ఏళ్లుగా బీజేపీలోనే ఉన్న ఆయన ఈ మధ్యే కాంగ్రెస్‌లో చేరారు. అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదన్న కోపంతో బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ఇది కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ నల్వాద్‌పై పోటీ చేసి 21 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. లింగాయత్‌ వర్గానికి చెందిన షెట్టర్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల  ఆ వర్గం ఓట్లు హస్తం పార్టీవైపే మొగ్గు చూపే అవకాశముంది. 


3. కాంగ్రెస్ తరపున ఉన్న కీలక అభ్యర్థుల్లో డీకే శివకుమార్ ఒకరు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులోనూ ఉన్నారు. బీజేపీపై గట్టిగా విమర్శలు చేసే నేతల్లో ఒకరు శివకుమార్. జనాల్ని సమీకరించడంలోనూ సిద్ధహస్తుడే. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అక్రమ ఆస్తుల కేసులో ఆయనపై ఆరోపణలు రావడం కాంగ్రెస్‌లో కాస్త కలవరం కలిగించింది. అందుకే...బ్యాకప్‌గా ఆయన సోదరుడు డీకే సురేష్ కూడా అదే నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 


4. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కీలక అభ్యర్థుల్లో ఒకరు. 2008లో వరుణ నియోజకవర్గం ఏర్పడగా అప్పటి నుంచి అక్కడే పోటీ చేస్తున్నారు సిద్దరామయ్య. 2018 ఎన్నికల్లో బదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. చాముండేశ్వరిలో దేవేగౌడ చేతిలో ఓడిపోయినా సిద్దరామయ్య...బదామిలో మాత్రం గెలిచారు. 


5. జేడీఎస్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఎప్పుడూ కింగ్‌మేకరే. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు ఎంపీగానూ విజయం సాధించారు. బీజేపీతో ఎప్పుడూ టగ్‌ఆఫ్ వార్ ఎదుర్కొంటారు. అయితే...జేడీఎస్‌కి కొన్ని కంచుకోటలున్నాయి. అక్కడ కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది ఈ పార్టీ. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించకపోతే అప్పుడు జేడీఎస్‌ కింగ్ మేకర్‌గా నిలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. 


Also Read: WhatsApp Privacy: ప్రైవసీని ఉల్లంఘిస్తే ఊరుకోం, విచారణ జరుపుతాం - వాట్సాప్‌కు ఐటీ మంత్రి వార్నింగ్