Johnson Baby Powder:


మా ప్రొడక్ట్‌కు డిమాండ్ లేదు: జాన్సన్ అండ్ జాన్సన్


జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఓ కీలక ప్రకటన చేసింది. తమ సంస్థకు చెందిన బేబీ టాల్కమ్ పౌడర్ విక్రయాలను 2023 నాటికి పూర్తి స్థాయిలో నిలిపివేయనున్నట్టు తెలిపింది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రొడక్ట్‌పై వివాదాలు నడుస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...ఈ విషయమై ఎన్నో సార్లు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంది. ఇప్పటికే అమెరికా, కెనడాలో సరఫరా నిలిపివేసింది. టాల్కమ్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలున్నాయన్న వార్తలతో అప్పట్లో చాలా మంది ఈ పౌడర్‌ను కొనుగోలు చేయటం మానేశారు. అప్పటి నుంచి వీటి విక్రయాలు 
తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా అమెరికాలోని ప్రజలు పూర్తిగా ఈ ప్రొడక్ట్‌ను పక్కన పెట్టేశారు. కొంతమంది ఈ కంపెనీకి వ్యతిరేకంగా పిటిషన్లు కూడా వేశారు. ఈ వాదనలు, ప్రతివాదనలు నడుస్తుండగానే..కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. "ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, వాటిని పరిశీలించాం. మా వ్యాపార అభివృద్ధి కోసం ఏం చేయొచ్చని ఆలోచించాం. ప్రపంచవ్యాప్తంగా స్థితిగతులను పరిశీలించాకే, ఈ నిర్ణయం తీసుకున్నాం. కొన్ని చోట్ల మా ప్రొడక్ట్‌కు ఏ మాత్రం డిమాండ్ లేదు. వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. మా ప్రొడక్ట్‌నుకొనుగోలు చేయటం లేదు" అని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.





 




క్యాన్సర్ కారకాలున్నాయని పిటిషన్లు 


అమెరికాలో వేలాది పిటిషన్లు ఎదుర్కొన్న ఈ సంస్థ 2020 మేలో అక్కడ విక్రయాలను ఆపేయాల్సి వచ్చింది. కంపెనీ సరైన నిర్ణయం తీసుకుందంటూ...చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "దశాబ్దాలుగా క్యాన్సర్ కారకాలున్న పౌడర్‌ను విక్రయిస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ..ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది. నార్త్ అమెరికాలో రెండేళ్ల క్రితమే విక్రయాలు ఆపేసింది. ఈ విషయంలో
జాప్యం ఏ మాత్రం మంచిది కాదు" అని కొందరు అభిప్రాయపడుతున్నారు. చిన్నారుల ఒంటిపై దద్దుర్లు రాకుండా ఈ టాల్కమ్ పౌడర్ నిరోధిస్తుందని ప్రచారం చేసినా...అది వ్యాధులకు కారణమవుతోందని చాలా మంది విమర్శించారు. ఈ కారణంగానే...ఈ సంస్థపై పిటిషన్లు వెల్లువెత్తాయి. తప్పని పరిస్థితుల్లో టాల్కమ్ పౌడర్ విక్రయాలను నిలిపివేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. టాల్కమ్‌ పౌడర్‌కు బదులుగా మొక్కజొన్న పిండిని వినియోగిస్తామని స్పష్టం చేసింది. 


Also Read: Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?


Also Read: BSNL New Plan: 2022 ప్లాన్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్ - 300 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్!