Jesus Christ Twitter:
క్రైస్ట్ పేరిట ఫేక్ అకౌంట్..
ట్విటర్ బ్లూ టిక్ కోసం నెలనెలా 8 డాలర్లు కట్టాల్సిందేనని ట్ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోవటం లేదు. పైగా వాటిని చాలా ఫన్నీగా తీసుకుంటున్నారు. "ట్విటర్ గురించి ట్విటర్‌లోనే కంప్లెయింట్ చేస్తున్నారు. ఎంత ఫన్నీగా ఉంది కదా" అంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. "మీరు ఎన్ని ఫిర్యాదులైనా చేయండి. కానీ డబ్బు కట్టడం మాత్రం మర్చిపోకండి" అని సెటైర్లు వేస్తున్నారు మస్క్. ఈ క్రమంలోనే...ట్విటర్ బ్లూని కూడా హ్యాకర్లు వదలటం లేదు. వెరిఫైడ్ ఫేక్ ప్రొఫైల్స్‌ని సృష్టించి ట్విటర్‌కు సవాలు విసురుతున్నారు. మొన్నామధ్య మస్క్ పేరిట ఓ అకౌంట్ క్రియేట్ చేసి రకరకాల భాషల్లో ట్వీట్‌లు చేసిన హ్యాకర్లు
ఇప్పుడు ఏకంగా జీసస్ క్రైస్ట్ పేరిట ఓ వెరిఫైడ్ ట్విటర్ బ్లూ అకౌంట్ సృష్టించారు. జీసస్ క్రైస్ట్ నవ్వుతూ కన్ను కొడుతూ ఉన్న డీపీని ఈ అకౌంట్‌కు సెట్ చేశారు. అంతే కాదు. కుడిచేయి బొటన వేలుని కిందకు దించి, ఎడమ చేయి బొటనవేలుని చూపించే విధంగా ఎడిట్ చేసి ఆ ఫోటోని డీపీగా పెట్టారు. మరో ట్విస్ట్ ఏంటంటే...ఈ అకౌంట్‌కు 7 లక్షల 82 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. బ్లూటిక్ వచ్చిందని చెబుతూ నవంబర్ 9వ తేదీన ఈ అకౌంట్ నుంచి ట్వీట్‌లు కూడా పోస్ట్ అయ్యాయి. "ఎవరి అకౌంట్‌లు వెరిఫై అయ్యాయి" అని ట్వీట్ చేశారు. అయితే దీనిపై ఓ టీవీ ఛానల్ వార్త రాసింది. ఇదంతా ఫేక్ అయ్యుండొచ్చని చెప్పింది. ఆ హ్యాకర్ ఆ వార్తను కూడా ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. "ఇది ఫేక్ అకౌంట్ అని ఊహించుకోవడం ఎందుకు" అంటూ ట్వీట్ చేశాడు. GOD పేరిట మరో అకౌంట్‌ను క్రియేట్ చేశారు. "మొత్తానికి నా ట్విటర్ అకౌంట్‌కు బ్లూ చెక్ చేసుకునే అవకాశం వచ్చింది. దీని ద్వారా నన్ను నేను నిజమైన ట్విటర్ దేవుడిగా ప్రకటించుకోవచ్చు. ఇందుకోసం మస్క్‌కు నేను ఏడాదిది 96 డాలర్లు చెల్లిస్తాను" అని ట్వీట్ చేశారు.
మస్క్ అకౌంట్ కూడా..
ట్విటర్ సీఈవో ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఉన్నట్టుండి ఆయన అకౌంట్‌లో ట్వీట్‌లన్నీ హిందీలో కనిపించాయి. హిందీతో పాటు భోజ్‌పురి భాషలోనూ ట్వీట్‌లు కనిపించటం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. అవన్నీ ఫన్నీగా ఉండటం వల్ల వేలాది మంది రీట్వీట్ చేశారు.
ఫలితంగా...ఈ అకౌంట్ అందరికీ రీచ్ అయిపోయింది. వేల మంది ఫాలో అయ్యారు కూడా. వెంటనే గుర్తించిన ట్విటర్ ఈ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది. అప్పటికే ఈ అకౌంట్‌కు 97.2 వేల ఫాలోవర్లు వచ్చారు. ఎలన్ మస్క్ పేరిట ఎన్నో ట్వీట్‌లు దర్శనమిచ్చాయి.@iawoolford అనే ట్విటర్ యూజర్...అకౌంట్ పేరుని Elon Musk అని మార్చుకున్నాడు. ఇంత కన్‌ఫ్యూజన్ కేవలం ఈ యూజర్ వల్లే. అంతేకాదు. ఒరిజినల్ మస్క్ అకౌంట్ ఎలా అయితే ఉందో అలానే తన డిటెయిల్స్ అన్నీ మార్చేశాడు. డీపీ, ట్యాగ్‌లైన్ ఒకేలా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. అప్పటికే రాకెట్ వేగంతో ఈ అకౌంట్ అందరికీ చేరువైపోయింది. ఇది ఫేక్ అకౌంట్ అని నిర్ధరణ అయ్యాక నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు.
Also Read: Rajiv Gandhi Case: ఆ దోషులను వెంటనే విడుదల చేయండి, రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు