Doda District Sinking:
దోడ జిల్లాలో..
జమ్ముకశ్మీర్‌లోని దోడ (Doda)జిల్లాలోనూ జోషిమఠ్ లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆరు బిల్డింగ్‌లకు పగుళ్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. మరి కొన్ని భవనాలూ ప్రమాదకర స్థితిలో ఉన్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని చూస్తున్నట్టు తెలిపారు.
"దోడ జిల్లాలోని కొన్ని ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. డిసెంబర్ నాటికే ఈ పరిస్థితులు కనిపించాయి. ముందుగా ఓ ఆరు ఇళ్లకు పగుళ్లు గుర్తించాం. ఇవి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం కుంగిపోతోంది"
- జమ్ముకశ్మీర్ అధికారి
ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాల్లోని వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జియాలజిస్ట్‌లతో పాటు మరి కొంత మంది నిపుణులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. పగుళ్లకు కారణాలేంటో అని ఆరా తీస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో పరిస్థితులు దిగజారుతున్నాయి. దాదాపు 863 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. వీటిలో 181 ఇళ్లను ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు గుర్తించారు.
ఆందోళన..
ఈ ప్రాంతం కాంటూర్ మ్యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆర్‌డబ్ల్యుడీని ఆదేశించారు. బాధిత ప్రజల నుంచి సలహాలను తీసుకున్న తర్వాత, ప్రజల తరలింపుపై ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. శనివారం జోషిమఠ్ లో వాతావరణం అనుకూలించడంతో భవనాల కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. జేపీ కాలనీ సమీపంలో నీటి విడుదలను
136 ఎల్‌పీఎమ్‌లకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. జేపీ కాలనీకి నీటి విడుదల మొదట్లో 540 ఎల్‌పీఎమ్‌గా ఉంది. ఇది గణనీయంగా తగ్గడం సానుకూల సంకేతం అని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ సిన్హా తెలిపారు. మంచు భారీగా కురుస్తుడడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం కూల్చివేత నిలిపివేశామన్నారు. భారీగా మంచు కురుస్తుండడం వల్ల తాత్కాలిక సహాయ
శిబిరాల్లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోషిమఠ్‌లోని బాధిత ప్రజలకు సహాయం అందిస్తున్నామని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోని హిమాయాల ఏటవాలు ప్రాంతంలో కట్టిన గ్రామం జోషి మఠ్ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడటం కలవరపాటుకు గురి చేస్తోంది. జోషిమఠ్ నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలాంగ్ గ్రామం పరిస్థితి కూడా దాదాపు జోషి మఠ్ లాగానే ఉంది.
Also Read: Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !