Jammu and Kashmir CM Omar Abdullah: పిచ్చి పట్టినట్లుగా జమ్మూపై డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ విరుచుకుపడింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో భారత్ చాలా వరకూ గాల్లోనే వాటన్నింటిని నిర్వీర్యం చేసింది . పాకిస్తాన్ చేసిన పనితో ఇప్పుడా దేశంపై భారత్ దండెత్తుతోంది. అయితే జమ్మూలో ఏదో జరిగిపోయిందని అనుకున్న వారికి జమ్మూ, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నిజాలు చూపించారు. పాకిస్తాన్ డ్రోన్ల వల్ల చిన్న నష్టం కూడా జరగలేదని ఆయన చూపించారు.
ఉదయమే ఆయన జమ్మూలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. కశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉందో .. పాకిస్తాన్ గురించి ఎవరూ ఆందోళన చెందడం లేదన్న విషయాన్ని కూడా చూపించారు.
సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అందుకే అక్కడి గ్రామాల ప్రజలకు జమ్మూలో భారీ షెల్టర్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లి అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడి సందడి చేశారు.
క్యాంపుల్లో ఉన్నప్రజలతో మాట్లాడారు. పాకిస్తాన్ పౌరులను టార్గెట్ చేస్తూ చేయకూడదని తప్పు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
జమ్మూ కశ్మీర్ సీఎంగా భద్రతాపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ ఒమర్ అబ్దుల్లా ఏ మాత్రం లెక్క చేయడం లేదు. పాకిస్తాన్ కు అంత సీన్ లేదని.. దొంగతెబ్బతీయడం తప్ప.. నేరుగా దాడి చేయలేరని.. భారత్ దెబ్బకు వాళ్ల డ్రోన్స్ అన్నీ నిర్వీర్యం అయిపోయానని గుర్తు చేస్తున్నారు.