సెక్స్ వర్కర్లకు ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు, రేషన్‌ కార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వృత్తి, ఉద్యోగాలతో సంబంధం లేకుండా అందరికీ ప్రాథమిక హక్కులు కల్పించాలని పేర్కొంది. గుర్తింపు కార్డులు లేనివారికి కూడా రేషన్‌ బియ్యం ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో సెక్స్ వర్కర్లు పడిన సమస్యలపై వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.







సెక్స్ వర్కర్లుకు రేషన్‌ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు దశాబ్దం కిందనే ఆదేశించినా ఎందుకు అమలు చేయడం లేదు? పౌరులు చేసే వృత్తి, ఉద్యోగానికి సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. దేశంలోని ప్రజలకు ప్రభుత్వాలు విధిగా అన్ని సౌకర్యాలని కల్పించాలి.


ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్‌ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెక్స్ వర్కర్లకు రేషన్‌, ఓటర్‌ కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘాల సహాయం తీసుకోవాలని తెలిపింది.


కమ్యూనిటీ ఆధారిత సంస్థలు అందించిన సమాచారంతో సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు అందించే ఐడీ కార్డులను తయారు చేసే క్రమంలో వారి పేర్లు, గుర్తింపును గోప్యంగా ఉంచాలని సుప్రీం కోర్టు సూచించింది.


Also Read: Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి


Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి