ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించి చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. తాజాగా చంద్రయాన్ అంతరిక్షంలో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటలీలోని మన్సియానోకు చెందిన వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ అంతరిక్షంలో తిరుగుతూ చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న చంద్రయాన్-3ను చిత్రీకరించింది. అందులో చంద్రయాన్-3 ఓ చుక్కలా వేగంగా ప్రయాణిస్తోంది. భూమికి 341 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-3 కదలికలను వర్చువల్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇటలీకి చెందిన ఈ వర్చువల్ టెలిస్కోప్ ఖగోళానికి చెందిన పలు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తించి సమాచారం ఇస్తూ ఉంటుంది. చంద్రయాన్-3 విషయంలోను ఈ టెలిస్కోప్ తన పనితనం, నైపుణ్యం ప్రదర్శించింది.
చంద్రయాన్-3 ప్రత్యేకతలు
చంద్రయాన్ 3 బరువు 3,921కిలోలు. భూమి నుంచి చంద్రుడి వరకూ దాదాపు 4 లక్షల కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. దీన్ని బాహుబలి రాకెట్‌గా చెప్పిన ఇస్రో ఆ తరవాత దానికి Launch Vehicle Mark 3 గా పేరు పెట్టింది. దీని బరువు 642 టన్నులు. చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. చంద్రయాన్ 3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చంద్రయాన్ 3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు.
ఆగస్టు చివరి వారంలో చంద్రుడిపై ల్యాండింగ్
24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. ఇక్కడ సాఫ్ట్‌ల్యాండింగ్ అయితే...ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అయినట్టు లెక్క. 3.5లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించిన తరవాత చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుంది. ల్యాండర్, రోవర్ మాడ్యూల్ వేరువేరుగా ఉన్న ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి సౌత్ పోల్‌కి సమీపంలో ల్యాండ్ అవ్వనుంది. ప్రపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్ విడిపోతుంది. లాంఛ్ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్ దిగుతుంది. అయితే..చంద్రుడిపై సన్‌రైజ్ ఎలా ఉందన్న దానిపైనే ల్యాండింగ్ ఎప్పుడవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. సన్‌రైజ్‌లో ఆలస్యం జరిగితే..ల్యాండింగ్ కూడా లేట్ అవుతుంది. అదే జరిగితే...ఇస్రో ల్యాండింగ్‌ని సెప్టెంబర్‌కి రీషెడ్యూల్ చేస్తుంది. కానీ...ఈ మిషన్‌లో అసలైన క్రూషియల్ పాయింట్ ఇదే. ల్యాండింగ్‌కి కనీసం 15 నిముషాల సమయం పడుతుంది.
కరోనాతో ప్రయోగం ఆలస్యం
2020 జనవరిలో ఇస్రో తొలిసారి చంద్రయాన్ 3పై ప్రకటన చేసింది. డిజైన్‌పై పని చేస్తున్నామని, త్వరలోనే స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లింగ్ పూర్తవుతుందని అప్పట్లో వెల్లడించింది. చంద్రయాన్ 2 కన్నా పకడ్బందీదా దీన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా ల్యాండర్ లెగ్స్‌ని మరింత దృఢంగా తయారు చేశారు. నిజానికి 2021లోనే ప్రయోగించాలని భావించినా కొవిడ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సెకండ్ వేవ్ వల్ల మరింత జాప్యం జరిగింది. అప్పటికే ప్రపల్షన్ సిస్టమ్ టెస్టింగ్ పూర్తైంది. ఇన్ని రోజుల తరవాత జులై 14న లాంఛ్ చేస్తామని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. Launch Vehicle Mark 3 ద్వారా ఈ ప్రయోగం చేపట్టింది.