దేశంలో ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ (E85, E100)ను భారత ప్రభుత్వం చాలా వేగంగా ప్రమోట్ చేస్తోంది. ఢిల్లీ లాంటి నగరాల్లో E85 ఫ్యూయల్ లీటరుకు సుమారు రూ.82.12 ధరతో లాంచ్ అయింది. ఇది నార్మల్ పెట్రోల్ కంటే దాదాపు 20 రూపాయలు చౌక. బంక్ దగ్గర ఉన్న ఈ రేటును చూసి ప్రతి ఒక్కరూ ఇకపై ఇథనాల్ పెట్రోల్ కొట్టించాలని అనుకుంటున్నారు. అయితే మీ వాహనం ఇంజిన్ ఇథనాల్ ను సపోర్ట్ చేయకపోతే కొత్త రకం ఇంధనాన్ని కొట్టించవద్దు.

Continues below advertisement

కేవలం ఇథనాల్ పెట్రోల్ ధర తక్కువగా ఉందని కొట్టించి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. కేవలం లీటరు ధర తగ్గడం వల్లే మీ ఖర్చు తగ్గుతుందని చెప్పలేం. ఇథనాల్‌తో బండి నడిపితే అయ్యే మొత్తం ఖర్చు అర్థం చేసుకున్నప్పుడు, చౌకగా కనిపించే ఈ ఫ్యూయల్ నిజానికి మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో క్లారిటీ వస్తుంది. ఇథనాల్ పెట్రోల్ వల్ల బండి మైలేజీ తగ్గుతుందా, పెరుగుతుందా అనే అంశాలు ప్రభావితం చేస్తాయి. 

మైలేజ్ ఎందుకు తగ్గిపోతుంది?ఇథనాల్‌తో కార్ నడిపితే ఏం జరుగుతుందో ఇక్కడ అందిస్తున్నా. ముందుగా మీరు ఎనర్జీ డెన్సిటీని అర్థం చేసుకోవాలి. సైన్స్ ప్రకారం, ఇథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే దాదాపు 30 నుండి 35 శాతం ఎనర్జీ తక్కువగా ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, 1 లీటరు పెట్రోల్ మండటం వల్ల ఇంజన్‌కు లభించే అంత శక్తిని, 1 లీటరు ఇథనాల్ ఇంధనం ఇవ్వలేదు. ఇదే కారణంతో  ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ అంతే శక్తిని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ మొత్తంలో ఇథనాల్‌ను ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఇథనాల్ (E85 లేదా E100) వినియోగించేటప్పుడు మీ బండి మైలేజ్ నేరుగా 20 నుండి 30 శాతం వరకు కిందకు పడిపోయే అవకాశం ఉంది. 

Continues below advertisement

Also Read: Bajaj Chetak 2026 Price: ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్లు ఆగాల్సిన పని లేదు! బజాజ్‌ చేతక్‌ ఈవీ పూర్తి వివరాలు ఇవే!

ఇప్పుడు ఉదాహరణకు మీ కార్ పెట్రోల్ (E20) పై లీటరుకు 18 కిలోమీటర్ల మైలైజీ ఇస్తుందనుకుందాం. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.102 ఉంది, కాబట్టి మీకు ఒక కిలోమీటర్ జర్నీకి అయ్యే ఖర్చు దాదాపు 5.67 రూపాయలు అవుతుంది. ఒకవేళ మీరు అదే బండిలో 82.12 లీటర్ ధర గల E85 ఫ్యూయల్ పోయిస్తే, తక్కువ ఎనర్జీ డెన్సిటీ కారణంగా మైలేజ్ తగ్గి ఒక లీటరుకు 13.5 నుంచి 14 కిలోమీటర్ల వరకు మాత్రమే వస్తుంది.

ఇప్పుడు ఈ తగ్గిన మైలేజ్ ప్రకారం మీరు చెక్ చేస్తే E85 పై మీ కార్ ఒక కిలోమీటర్ ప్రయాణ ఖర్చు రూ.6.08 అవుతుంది. అంటే బంక్ వద్ద 20 రూపాయలు చౌకగా లభించినప్పటికీ, మైలేజీ తగ్గడంతో మీకు పెట్రోల్ కంటే కాస్త ఖర్చు ఎక్కువే చేయాల్సి వస్తుంది. 

Also Read: SUV కొనాలని ఆలోచిస్తున్నారా? త్వరలో మార్కెట్లోకి రానున్న 6 పవర్‌ఫుల్ వెహికల్స్

ఇథనాల్ ఎప్పుడు లాభదాయకంప్రపంచంలో ఇథనాల్‌కు అతిపెద్ద మార్కెట్ బ్రెజిల్ కాగా, అక్కడ ప్రజలు బండిలో ఫ్యూయల్ పోయించేటప్పుడు ఒక చాలా సింపుల్ ఫార్ములాను పాటిస్తారు, దాన్నే 70% రూల్ అంటారు. ఈ నియమం ప్రకారం, ఇథనాల్ ధర పెట్రోల్ ధరతో పోలిస్తే 70% లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బండిలో ఇథనాల్‌ పోయించి నడుపుతారు. 

భారత్ విషయానికి వస్తే, ప్రస్తుతం E85 ధర పెట్రోల్ ధరతో పోలిస్తే దాదాపు 80 శాతంగాఉంది. అంటే ప్రభుత్వం ఇథనాల్ ధరలను తగ్గించి లీటరుకు 70 నుండి 72 రూపాయలు తీసుకురానంత వరకు, మధ్యతరగతి వారికి ఇథనాల్ వాడకంతో పెద్దగా ప్రయోజనం లేకపోగా ఖర్చు కాస్త పెరుగుతుందని అర్థమవుతోంది. అయితే, భవిష్యత్తులో ఒకవేళ ముడి చమురు ధరలు పెరిగితే, ఇథనాల్ ఇంధనంతో ప్రయోజనం కలగనుంది.