Bajaj Chetak 2026 Price: ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు చేతక్‌ అంటే కేవలం ఒక స్కూటర్ మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్‌. కాలక్రమేణా మాయమైనా ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్‌లో సరికొత్త హంగులతో మళ్లీ రోడ్లపై హల్చల్ చేస్తోంది. బజాజ్‌ ఆటో తన ఐకానిక్‌ బ్రాండ్‌ను 2026 వెర్షన్‌లో మరింత పవర్‌ఫుల్‌గా, అత్యాధునిక ఫీచర్లతో లాంచ్ చేసింది. మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేటెడ్‌ బజాజ్‌ చేతక్‌ 2026 గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 

కేవలం స్టైల్‌‌ మాత్రమే కాదు. పెర్ఫార్మెన్స్‌లోనూ ఈసారి బజాజ్‌ తగ్గేదేలే అంటోంది. గత మోడల్స్‌తో పోలిస్తే ఇప్పుడు టాప్‌ స్పీడ్, రేంజ్ పెరగడం ఆకట్టుకునే అంశం. ఓలా, ఏథ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ, ప్రీమియం మెట్ బాడీతో వస్తున్న ఈ స్కూటర్ ఈచర్లు మీ మైండ్‌ బ్లాక్ చేయడం ఖాయం. 

మెటల్ బాడీతో అదిరిపోయే లుక్‌

బజాజ్‌ చేతక్ అనగానే మనకు గుర్చొచ్చేది దాని దృఢమైన మెటల్‌ బాడీ. నేటి కాలంలో వస్తున్న ప్లాస్టిక్ స్కూటర్‌కు భిన్నంగా చేతక్ క్లాసిక్‌ రెట్రో లుక్‌, నియో- రెట్రో డిజైన్‌తో వస్తుంది. 2026 మోడల్‌లో ఇండిగో బ్లూ, బ్రూక్లిన్‌ బ్లాక్, పిస్తా గ్రీన్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇందులో ఉన్న ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ రింగ్, మెటాలిక్‌ ఫినిషింగ్ దీనికి ప్రీమియం ఫీల్‌ను ఇస్తాయి. 

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లంటే స్పీడ్ ఉండదని చాలా మంది ఫీలవుతుంటారు. కానీ అప్‌డేట్‌ చేతక్ ఆ అపోహను చెరిపేస్తోంది. ప్లాగ్‌షిప్‌ మోడల్స్ అయిన C3501, C3502 ఇప్పుడు 80 kmph వేగంతో దూసుకపోగలవు. 305kWh బ్యాటరీ సామర్థ్యం ఉన్న వేరియంట్లు సింగిల్‌ ఛార్జ్‌పై 153 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. కేవలం 2 గంటల 55 నిమిషాల్లోనే 0-80 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుంది. 

స్మార్ట్ ఫోన్ లాంటి స్కూటర్ 

కొత్త చేతక్ కేవలం వాహనం మాత్రమే కాదు. ఒక గ్యాడ్జెట్‌ లాంటిది. ఇందులో 5-ఇంచ్‌లా టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. మీరు టెక్ ప్యాక్ ఆప్షన్ ఎంచుకుంటే ఇందులో గూగుల్ మ్యాప్‌ నావిగేషన్, కాల్స్, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు పొందవచ్చు. అంతేకాదు, ట్రాఫిక్‌లో ఉపయోగపడే హిల్‌ హోల్డ్‌ అసిస్టెంట్‌, పెర్ఫార్మెన్స్‌ కోసం స్పోర్ట్స్‌ ఎకో మోడ్స్‌ ఇందులో వస్తున్నాయి. 

వేరియంట్స్‌- స్పెసిఫికేషన్స్‌

మోడల్‌ 

బ్యాటరీ

రేంజ్‌ 

టాప్ స్పీడ్‌ 

ధర 

చేతక్‌ C3501 3.5kWh 153 KM 80kmph రూ. 1,47,507
చేతక్‌ C3502 3.5kWh 153 KM 80kmph 1,35,306  

చేతక్‌ C3503 

3.5kWh 151 KM 70kmph 1,21,807
చేతక్‌ C3001 3.0kWh 127 KM 70kmph 1,11,006

చేతక్‌ C2501 

2.5kWh 113 KM 60kmph 1,35,306

మీరు స్మార్ట్‌ ఫీచర్లు , గూగుల్‌ మ్యాప్స్‌ నావిగేషన్ కావాలనుకుంటే, అదనంగా 9వేలు చెల్లించి టెక్‌ప్యాక్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది మీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా మార్చేస్తుంది.