Iran Waives Off Visas:



నో వీసా..


ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారతీయులు ఇకపై వీసా (Iran Visa) అవసరం లేకుండానే తమ దేశానికి రావచ్చని వెల్లడించింది. ఇరాన్‌ సాంస్కృతిక శాఖా మంత్రి ఎజతొల్లా (Ezzatollah Zarghami) ఈ ప్రకటన చేశారు. కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భారత్‌తో పాటు మొత్తం 33 దేశాల పౌరులు వీసా అవసరం లేకుండానే ఇరాన్‌కి వచ్చేలా కీలక మార్పులు చేసింది ఆ ప్రభుత్వం. కేబినెట్ మీటింగ్ తరవాత స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు ఎజతొల్లా. ప్రపంచవ్యాప్తంగా విజిటర్స్‌ని పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇరాన్. అదే సమయంలో పర్యాటక రంగాన్ని (Iran Tourism)బలోపేతం చేసేందుకూ ఇలా నిబంధనలు సవరించింది. ఇరాన్‌ గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆ మరకను పోగొట్టుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు మంత్రి ఎజతొల్లా వివరించారు. ఈ మధ్య మలేషియా, శ్రీలంక, వియత్నాం కూడా వీసా నిబంధనలను ఎత్తివేసింది. భారతీయ పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి భారత్‌ ఔట్‌బౌండ్ టూరిజం (India Outbound Tourism Market) మార్కెట్‌ ఇటీవల బాగా బూస్ట్ అయింది. McKinsey లెక్కల ప్రకారం...గతేడాది కోటి 30 లక్షల మంది భారతీయులు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇరాన్‌ ప్రకటన ప్రకారం భారత్‌తో పాటు యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, టాంజానియా, కాంబోడియా, మలేషియా సహా పలు దేశాల పౌరులు వీసాలు లేకుండానే ఇరాన్‌కి వెళ్లచ్చు. ఇటీవలి లెక్కల ఆధారంగా చూస్తే...ఇరాన్‌లో  విదేశీ పర్యాటకుల సంఖ్య 44 లక్షలకు పెరిగింది. గతేడాదితో పోల్చి చూస్తే ఇది 48.5% ఎక్కువ. ఈ డిమాండ్‌ని మరింత పెంచేందుకు వీసా నిబంధనలను పక్కన పెట్టింది ఇరాన్. 


థాయ్‌లాండ్‌ కూడా..


థాయ్​లాండ్ దేశం.. భారతీయులు వీసా లేకుండా కూడా మా దేశానికి రావొచ్చు. వచ్చే ఆరు నెలల్లో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వీసా లేకుండా రావొచ్చు అంటూ బంపర్ ఛాన్స్ ఇచ్చేసింది. ఆ దేశంలో టూరిజం మార్కెట్​ను పెంచుకునేందుకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ సంవత్సరం సుమారు 28 మిలియన్ల రాకపోకలను థాయ్​లాండ్ లక్ష్యంగా చేసుకుంది. దేశంలో ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా థాయ్​లాండ్ ఆర్థిక వ్యవస్థ భారీగా ఎగుమతిపై ఆధారపడి ఉంది. ఏ దేశ ఆర్థిక వృద్ధిలో అయినా పర్యాటక రంగం కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఇండియన్స్​ను వీసా లేకుండా తమ దేశానికి రమ్మంటుంది పర్యాటక రంగం. ఇంతకీ దీనికి గడువు ఏమైనా ఉందా? మనం ఎప్పుడు వెళ్లొచ్చు? అంటే దీనికి గడువు ఉంది. మనం నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు ఆరునెలల పాటు.. థాయ్​లాండ్​కు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. టూరిజం సీజన్ దగ్గర్లోనే ఉంది కాబట్టి.. మీరు వెళ్లాలనుకుంటే కచ్చితంగా ఈ దేశాన్ని విజిట్ చేయవచ్చు.


Also Read: 30 అడుగుల జియాంట్‌ వీల్‌పై స్టంట్‌లు, అదుపు తప్పి పడిపోయిన యువకుడు - షాకింగ్ వీడియో