Krishna Mukunda Murari Telugu Serial December 15th Promo: సూసైడ్ అటెంప్ట్ చేసిన ముకుందని రక్షిస్తుంది కృష్ణ. అలాంటి కృష్ణ మనసుని ఎవరు అర్థం చేసుకోవట్లేదని బాధపడుతుంది రేవతి. మురారికి గతం గుర్తుకు వచ్చింది అని తెలిసినప్పటికీ ముకుందతో మురారి పెళ్లి జరుగుతుంది అని రేవతికి చెప్తుంది భవాని. అలాగే వేణిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


నీ మంచి మనసుని కాసేపు పక్కన పెడితే నువ్వు అనుకున్నదీ,మేము అనుకున్నది జరుగుతుంది అని మందలిస్తాడు గౌతమ్. మా ఆయనే నాకు అండగా ఉండగా నా కాపురానికి ఎలాంటి భయం లేదు అంటుంది కృష్ణ. ఇలాంటి తింగరి దాంతో నా కొడుకు ఎలా వేగుతాడో ఏంటో అని ముద్దుగా కసరుకుంటుంది రేవతి. అదే సమయంలో కిందన మురారి నందుని మందలిస్తూ ఉంటాడు. కృష్ణ మీకు ఎంత ఫేవరెట్ చేసింది మరిచిపోయారా.. నేనంటే గతం మర్చిపోయాను.


కృష్ణని అవుట్ హౌస్ లో ఉంచితే మీరేందుకు ఊరుకున్నారు, నువ్వంటే చిన్న పిల్లవి మా అమ్మ అయినాచెప్పాలి కదా అంటాడు. నీకు తెలియదు మురారి మేమందరం తనకి చాలా సపోర్ట్ గా ఉన్నాము. కానీ అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా అంటుంది నందు. ఈలోగా భవాని వచ్చి పెళ్లి కార్డు ఇస్తుంది. వచ్చే శుక్రవారం మీ పెళ్లి అంటుంది. ప్రభాకర్ నీకు యాక్సిడెంట్ అయ్యేలాగా చేశాడు. నువ్వు చనిపోయావని ఫేక్ డెడ్ బాడీ ని ఇంటికి పంపించింది కృష్ణ అని చెప్తుంది భవాని.


గతం గుర్తుకు వచ్చాక కూడా పెళ్లి అంటున్నారు ఏమిటి అయినా ఈ యాక్సిడెంట్ వాళ్ళ బాబాయ్ చేయించలేదు, ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ చేయించింది ఆయన కాదు వేరే ఎవరో, నాకు సరిగ్గా గుర్తు రావటం లేదు అని చెప్తాడు. అయినా అగ్రిమెంట్ మ్యారేజ్ అని నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది భవాని.


చెబుదామనే అనుకున్నాను కానీ ఈ లోగానే ఇదంతా జరిగింది అంటాడు మురారి.వచ్చే శుక్రవారం లోపు ఆ యాక్సిడెంట్ చేయించింది ఆయన కాదు అని నిరూపించు నిరూపించలేని పక్షంలో నీకు ముకుందకి పెళ్లి అందరూ సిద్ధంగా ఉండండి అంటుంది. అంతవరకు కృష్ణ కి ఇంటికి రావచ్చు పోవచ్చు కానీ మేము భార్యాభర్తల్లాగా ఉండము అంటాడు మురారి. అందుకు ఒప్పుకుంటుంది భవాని.


ఇక ప్రోమో విషయానికి వస్తే..


కృష్ణ ఇంటికి వస్తాడు మురారి. రేపు ఉదయం మనిద్దరం బయటికి వెళ్దాం అంటాడు. ఎక్కడికి అని అడుగుతుంది కృష్ణ. ఇంతకాలం దూరంగా ఉన్నాము ఇప్పుడు కూడా దూరంగా ఉండడం అంటే నా వల్ల కాదు అంటాడు మురారి. ఇచ్చిన మాటని ఎందుకు తప్పడం దూరంగానే ఉందాము అంటుంది కృష్ణ.


అయితే ఒక ముద్దు పెట్టు అని అడుగుతాడు మురారి. షాక్ అవుతుంది కృష్ణ. ఆమె షాక్ లో ఉండగానే గోడకి ఏదో రంగు ఉంది చూడు అని మురారి అనటంతో అటువైపు చూస్తుంది కృష్ణ. వెంటనే ముద్దు పెట్టి షాక్ ఇస్తాడు మురారి. మరి మురారి చెప్పినట్లుగానే వారం రోజుల్లో నిజాన్ని నిరూపిస్తాడా, లేదంటే ముకుందని పెళ్లి చేసుకుంటాడా? నిజం నిరూపించకుండా ఉండడానికి ముకుంద ఏమైనా చేస్తుందా? ఇవన్నీ తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.


 






Also Read: 2023లో నెటిజన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన మూవీస్ ఇవే - బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో ఆ మూవీ టాప్!