Iran Anti Hijab Protest: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో మహిళలు చేస్తోన్న ఆందోళనలు, అల్లర్లతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఈ ఆందోళనలపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతోన్న మహిళలు వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ రంగంలోకి దిగారు. మహిళలు వెనక్కి తగ్గకపోతే తీవ్ర శిక్షలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ఈ మేరకు అంతర్జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పష్టం చేశారు. నిరసనలకు, అల్లర్లకు ఎంతో తేడా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇరాన్‌కు బద్ధశత్రువైన అమెరికానే ఈ అగ్గికి ఆజ్యం పోస్తోందంటూ ఆరోపించారు.
తగ్గేదేలే!
భద్రతా దళాల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఇరాన్ మహిళలు పిడికిలి బిగిస్తూ నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 76 మంది మృత్యువాతపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కొందరు భద్రతా సిబ్బంది ఉండగా మృతుల్లో ఎక్కువ మంది ఆందోళనల్లో పాల్గొన్న మహిళలే ఉన్నారు.
ఉద్ధృతంగా
ఇరాన్‌లో 80 నగరాల్లో యాంటీ హిజాబ్ నిరసనలు కొనసాగుతున్నాయి. యువతులు, మహిళలు రోడ్లపైకి వచ్చిపెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నిరనసల్లో 75 మంది చనిపోయినట్టు అక్కడి రిపోర్ట్‌లు కొన్ని చెబుతున్నాయి. ఇప్పుడు మరో యువతి కూడా మృతి చెందింది. అంతకు ముందు ఆ యువతి వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొనే ముందు ఆమె...హిజాబ్ తీసేసి తన జుట్టుని ముడి వేసుకుంది. ఆ తరవాత నిరసనల్లోకి వెళ్లింది. ఇప్పుడీ యువతినే దుండుగులు కాల్చి చంపారు. 20 ఏళ్ల హదీస్ నజఫీని
పొత్తి కడుపులో, మెడపై, గుండెపై కాల్పులు జరిపారు. ఆమె అంత్యక్రియల వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. సమాధి పక్కనే మహిళలు ఆమె ఫోటో పట్టుకుని కన్నీరు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆమె శరీరంలో మొత్తం 6 బుల్లెట్లు గుర్తించారు. ఇరానియన్ జర్నలిస్ట్ ఒకరు ట్విటర్‌లో హదీస్ నజాఫీ అంత్యక్రియల వీడియో పోస్ట్ చేశారు. "హదీస్ మంచి అమ్మాయి. డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడేది. మహ్‌సా అమిని మృతికి వ్యతిరేకంగా ఆమె నిరసనల్లో పాల్గొంది" అని ట్వీట్ చేశారు.
Also Read: Viral Video: కారు డోర్ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!
Also Read: UP Politics: ఎస్‌పీ చీఫ్‌గా మరోసారి అఖిలేశ్- అధికారాన్ని లాగేసుకున్నారని BJPపై విమర్శలు