Indonesia Earthquake:


సౌత్ జకార్తాలో భూకంపం..


ఇండోనేషియా రాజధాని జకార్తాలో భూమి తీవ్రంగా కంపించింది. ఈ ధాటికి 20 మంది మృతి చెందగా..300 మంది గాయపడ్డారు. రిక్టార్ స్కేల్‌పై 5.4గా దీని తీవ్రత నమోదైంది. సౌత్ జకార్తాల్లోని నగరాల్లో ఈ ప్రభావం కనిపించింది. "రిక్టర్ స్కేల్‌పై 5.4గా భూకంప తీవ్రత నమోదైంది. సౌత్ జకార్తాలోని నగరాల్లో భూమి కంపించింది" అని  AFP న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. యూఎశ్ జియోలాజికల్ సర్వే ప్రకారం...వెస్ట్ జావా ప్రావిన్స్‌లోని సినాజుర్ ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. 10 కిలోమీటర్ల లోతు వరకూ దీని తీవ్రత నమోదైందని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఇళ్లు కూడా నేలమట్టమయ్యాయి. గ్రేటర్ జకార్తా ప్రాంత ప్రజలు ఈ ధాటికి భయంతో వణికిపోయారు. ఎత్తైన భవనాలు దాదాపు మూడు నిముషాల పాటు కంపించాయి. అప్పటికప్పుడు ఆ భవనాల్లోని వారిని బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. "భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్లిపోవాలని మేమంతా పరుగులు పెట్టాం" అని ఓ ఉద్యోగి వెల్లడించారు.