Cockroaches in IndiGo Flight: ఇండిగో ఫ్లైట్‌లోని ఫుడ్ ఏరియాలో బొద్ధింకలు కనిపించడం అలజడి సృష్టించింది. ఫ్లైట్స్‌లో హైజీన్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా లేదా అన్న కొత్త వాదనకు ఈ ఘటన తెర తీసింది. తరుణ్ శుక్లా అనే ఓ ప్యాసింజర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఇండిగో ఫ్లైట్‌లో తనకు బొద్ధింకలు కనిపించాయని చెప్పాడు. ఫ్లైట్స్‌ని హైజీన్‌గా ఉంచాలన్న విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ మండి పడ్డాడు. ఈ పోస్ట్‌లో ఇండిగో అకౌంట్‌ని ట్యాగ్ చేశాడు.
"ఇండిగో ఫ్లైట్‌లో ఫుడ్ ఏరియాలో బొద్ధింకలు కనిపించి షాక్ అయ్యాను. ఇది చాలా దారుణమైన విషయం. ఫ్లైట్స్‌ని చాలా క్లీన్‌గా ఉంచుతారన్న నమ్మకంతో ప్రయాణికులంతా ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగడం లేదు"
- ప్రయాణికుడు
ఈ పోస్ట్ వైరల్ అయింది. నెటిజన్లు ఇండిగో యాజమాన్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై IndiGo స్పందించింది. అప్పటికప్పుడు అన్ని ఫ్లైట్స్‌ని క్లీన్ చేయించింది. పురుగులు లేకుండా డిస్‌ఇన్‌ఫెక్టింగ్ చేసింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని వెల్లడించింది. అంతరాయం కలిగినందుకు క్షమించాలంటూ ఆ ప్యాసింజర్‌ని కోరింది. నెటిజన్లు మాత్రం కామెంట్స్ ఆపడం లేదు. ఒకప్పుడు బెస్ట్ సర్వీస్‌లు ఇచ్చిన ఇండిగో ఇప్పుడిలా తయారైందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
"ప్యాసింజర్ ఫిర్యాదు చేసిన వెంటనే మా సిబ్బంది స్పందించింది. అవసరమైన చర్యలు తీసుకుంది. ముందు జాగ్రత్తలో భాగంగా అన్ని ఫ్లైట్స్‌నీ క్లీన్ చేయించాం. ఇంకెవరకీ అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాం. హైజీన్‌ని పాటించడంలో మేం ఎప్పటికీ కట్టుబడే ఉంటాం. ఇకపై ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బంది కలగదు"
- ఇండిగో యాజమాన్యం
ఇప్పటికే కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఇండిగో ఎయిర్ లైన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇండిగో విమానంలో సర్వ్ చేసిన శాండ్‌విచ్‌లలో పురుగులు వచ్చాయని ఫిర్యాదు రావడంపై వైద్య శాఖ అధికారులు స్పందించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తమకు ఫిర్యాదు అందడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఇండిగో ఎయిర్ లైన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 29 వ తేదీన నాణ్యత లేని ఆహార పదార్థాలు విమానంలో సప్లై చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.