Indigo Flight Ticket Offers:
ఫ్యాబ్ ఫెబ్ సేల్..
ఈ హడావుడి లైఫ్ నుంచి కాస్త దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోవాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. బడ్జెట్ దగ్గరికొచ్చే సరికి వెనకడుగేస్తారు. విమానమెక్కి ఎక్కడికైనా వెళ్లి అక్కడి ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్ చేయాలనుకునే వారికి ఓ శుభవార్త చెప్పింది Indigo Airlines.తక్కువ ఖర్చుతోనే విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించనుంది. స్పెషల్ ఫేర్ సేల్ ప్రకటించింది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఇవాళ్టితో (ఫిబ్రవరి 24) ముగుస్తుంది. డొమెస్టిక్ ఫ్లైట్‌లో అయితే రూ.1,199నుంచి టికెట్ ధర ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో అయితే స్టార్టింగ్ ఫేర్ రూ.6,139గా ప్రకటించింది ఇండిగో. మార్చి 12 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్యలో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. #FabFebSaleతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది కంపెనీ. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టింది.
"FabFebSale వచ్చేసింది. ట్రిప్ వేయాలని అనుకోవడమే కాదు. టికెట్స్ కూడా బుక్ చేసుకోండి. ఈ ఆఫర్ ఫిబ్రవరి 24వ (నేటితో) ముగుస్తుంది"
- ఇండిగో ఎయిర్ లైన్స్
కండీషన్స్ అప్లై..
అయితే...ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవాలంటే కొన్ని షరతులు పెట్టింది కంపెనీ. ఒకవేళ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నా, అనుకోని కారణాల వల్ల రాలేకపోయినా ఈ టికెట్ ప్రైస్‌ని రీఫండ్ చేయరు. అంతే కాదు. వీటిపై ఇంకే ఇతర డిస్కౌంట్‌లు కూడా లభించవు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆధారంగా టికెట్‌లు ఇష్యూ చేస్తున్నట్టు ప్రకటించింది ఇండిగో. డైరెక్ట్ ఫ్లైట్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఇదే కాదు. మరో ఆఫర్ కూడా ప్రకటించింది ఇండిగో. మార్చి 13వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ మధ్యలో ట్రిప్‌లు ప్లాన్ చేసుకున్న వారికి డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ స్టార్టింగ్ ఫేర్‌ని రూ. 2,093గా నిర్ణయించింది. ఈ ఆఫర్ రేపటి (ఫిబ్రవరి 25) వరకూ కొనసాగనుంది. నాన్‌స్టాప్ ఫ్లైట్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను మరో ఆఫర్‌తో కలిపేందుకు వీలుండదు. ట్రిప్‌నకు వెళ్లకపోయినా క్యాష్ రీఫండ్ చేయరు. ఒకవేళ డెస్టినేషన్ మార్చుకోవాలంటే అదనంగా మరి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.