జానకి మందులు తీసుకొచ్చి వెన్నెలకి ఇస్తుంది. తను ఇస్తే తీసుకోవడం లేదని అత్తయ్యతో నువ్వే మింగించాలని చెప్పి వెన్నలకి ఇచ్చి పంపిస్తుంది. గోవిందరాజులు, తిలోత్తమ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని మల్లిక తనని ఆడుకోవాలని చూస్తుంది. కాసేపు తిక్క తిక్కగా మాట్లాడి గోవిందరాజులని ఆట ఆడుకుంటుంది. రామా బ్యాంక్ అతను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉండగా విష్ణు వస్తాడు. విష్ణుని ఆపి మాట్లాడి బ్యాంక్ వాయిదా ఏదో త్వరగా కట్టు వాళ్ళు ఇంటి వరకు వస్తే బాగోదు అనేసరికి విష్ణు షాక్ అవుతాడు. వాళ్ళ మాటలన్నీ విని జ్ఞానంబ బాధపడుతుంది. ఒకే రక్తం అయితే పంచి ఇవ్వగలిగాను కానీ ఒకే బుద్దులు ఇవ్వలేకపోయానని అనుకుంటుంది.


జానకి జ్ఞానంబ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటే రామ వచ్చి పలకరిస్తాడు. హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారని రామ జానకిని అడుగుతాడు. మీరు క్యారేజ్ తీసుకుళ్లలేదని కాలేజ్ కి వెళ్ళాను, దారిలో ఒకతను కనిపించి హాస్పిటల్ కి వెళ్ళినట్టు చెప్పాడు. మీ మొహంలో కంగారు కనిపిస్తుంది. చదువుకోవడం మానేసి ఇలా కంగారుపడితే చదువు పాడైపోతుంది కదా అని అంటాడు. జానకి కన్నీళ్ళు పెట్టుకుని కవర్ చేసుకుని రామతో మాట్లాడుతుంది. జెస్సికి నెలలు నిండుతున్నాయ్ కదా తన ఆరోగ్యం గురించి కనుక్కోవడానికి మాత్రమే వెళ్లానని అబద్ధం చెప్తుంది. జెస్సి గురించి పట్టించుకోవడానికి అఖిల్ ఉన్నాడు కదా అని రామ బాధగా మాట్లాడి వెళ్ళిపోతాడు. నిజం తెలిస్తే మీరు బాధపడతారు అందుకే అబద్ధం చెప్పాను అని జానకి బాధపడుతుంది.


Also Read: 'బ్రహ్మ' ఆట మొదలైంది- స్వప్న పెళ్లి కాంట్రాక్ట్ కావ్యకి, మరో అమ్మాయితో రాహుల్


జ్ఞానంబ మందులు చూసి ఇన్ని వేసుకుంటే ఇంకేయమిన ఉందా అని వాటిని తీసి దాచిపెడుతుంది. వెన్నెల అది చూసి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటుంది. ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే గొంతు నొప్పి వస్తుందని, మాత్రలు వేసుకోలేను అని జ్ఞానంబ కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. అన్ని మాత్రలు వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా అని గోవిందరాజులు అంటాడు. అయినా అమ్మకి ఏమైందని జానకి ఇన్ని మందులు వేసుకోమంటుందని గోవిందరాజులు అనుకుంటాడు. అప్పుడే మలయాళం వచ్చి గ్రీన్ కాఫీ అని తీసుకొచ్చి ఇస్తాడు. అది చూసి బిత్తరపోతాడు. అప్పుడే డాక్టర్, నర్స్ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ టెస్ట్ లు చేయాలని చెప్తారు. వద్దని గోవిందరాజులు అంటే జానకి వచ్చి నచ్చజెప్పి ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. జానకి తనకిచ్చిన ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తుందో డాక్టర్ ని అడిగి కనుక్కోవాలని జ్ఞానంబ అనుకుంటుంది.


Also Read: కథలోకి కొత్త హీరో ఎంట్రీ, దివ్యకి జోడీ రెడీ- రాజ్యలక్ష్మికి శత్రువుగా మారిన తులసి


ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి డాక్టర్ కి ఇచ్చి వాటిని ఎందుకు వాడతారో చెప్పమని జ్ఞానంబ అడుగుతుంది. అది జానకి చూసి కంగారుగా డాక్టర్ కి దూరంగా ఉంది సైగ చేస్తుంది. నిజం చెప్పొద్దని సైగ చేయడం మల్లిక గమనిస్తుంది. ఏం ట్యాబ్లెట్స్ అవి జానకి ఎందుకు అలా సైగ చేస్తుందని అనుమానపడుతుంది. డాక్టర్ అవి బలానికి వాడే మందులని చెప్పేసరికి జానకి ఊపిరిపీల్చుకుంటుంది. ఇంట్లో అందరికీ రక్తపరీక్షలు చేయిస్తుంది. తర్వాత డాక్టర్ ని పక్కకి తీసుకెళ్ళి జానకి మాట్లాడటం రామ గమనిస్తాడు. అమ్మ విషయంలో ఎందుకు ఇంతగా కంగారుపడుతున్నారని రామ అనుమానిస్తాడు.