రాజ్యలక్ష్మి హాస్పిటల్ కి ఇంటర్వ్యూకి దివ్య తులసిని తీసుకుని వస్తుంది. అక్కడ ఒక పేషెంట్ కి అర్జంట్ గా సర్జరీ చేయాలని చెప్పేసరికి దానికి దివ్యని అటెండ్ అవమని రాజ్యలక్ష్మి చెప్తుంది. సర్జరీ చేయను అంటే వెళ్లిపొమ్మని చెప్తుంది. కానీ దివ్య మాత్రం సర్జరీ చేస్తానని చెప్తుంది. తులసి దేవుడి ముందు నిలబడి దణ్ణం పెట్టుకుంటుంటే దివ్య వచ్చి విషయం చెప్తుంది. అప్పుడే సర్జరీ ఏంటని తులసి టెన్షన్ పడుతుంది. తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని సర్జరీ చేయడానికి వెళ్తుంది. హాస్పిటల్ ముందు ఒకతను తన భార్యకి ఆపరేషన్ చెయ్యమని డాక్టర్స్ ని బతిమలాడతాడు. డబ్బు తీసుకురావడానికి అబ్బాయి వెళ్లాడని ఆపరేషన్ చేయమని కాళ్ళ మీద పడినా కూడా డాక్టర్స్ కనికరించరు. తులసి వచ్చి డాక్టర్స్ తిట్టి హాస్పిటల్ ముందు ధర్నాకు దిగుతుంది. డాక్టర్స్ వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టాల్సిందే అని తులసి గొడవ చేయడం అంతా రాజ్యలక్ష్మి చూస్తుంది.


Also Read: 'ఐలవ్యూ వేద' అంటూ భార్య మీద అమితమైన ప్రేమ చూపించిన యష్- చిత్రని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్న అభిమన్యు


రాజ్యలక్ష్మి తులసి దగ్గరకి వస్తుంది. తన స్టాఫ్ చెంప పగలగొడుతుంది. పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తీసుకొస్తావా. మనిషి ప్రాణం కంటే డబ్బుకి విలువ ఎక్కువ. ఈ హాస్పిటల్ నాది నేను నిర్ణయం తీసుకోవాలి. అర్జెంట్ గా వెళ్ళి పేషెంట్ కి ఆపరేషన్ చేయమని చెప్తుంది. డాక్టర్స్ తరఫున రాజ్యలక్ష్మి తులసి వాళ్ళకి క్షమాపణ చెప్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తులసిని మెచ్చుకుంటారు. సమయానికి వచ్చి కాపాడారని తులసి తనకి థాంక్స్ చెప్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత తులసిని ఇంకోసారి హాస్పిటల్ లోకి అడుగుపెట్టడానికి వీల్లేదని తను మనకి శత్రువు అని రాజ్యలక్ష్మి స్టాఫ్ తో చెప్తుంది. దివ్య చేసిన సర్జరీ సక్సెస్ అయ్యిందని మరొక డాక్టర్ వచ్చి చెప్తాడు. దివ్య రాజ్యలక్ష్మిని వచ్చి కలుస్తుంది. తనకి జాబ్ ఇస్తున్నట్టు చెప్పేసరికి దివ్య థాంక్యూ అమ్మ అంటుంది.


Also Read: మొదలైన పెళ్లి ఏర్పాట్లు - స్వప్నకి ఐలవ్యూ చెప్పిన రాహుల్, అక్కని నిలదీసిన కావ్య


పేషెంట్ ప్రాబ్లం చెప్పగానే నువ్వు చెకప్ చేయడం కాదు అవసరం ఉన్నా లేకపోయినా కనీసం ఐదు టెస్ట్ లు రాయాలి. మన హాస్పిటల్ ఆ టెస్ట్ లు చేయించాలి. రిపోర్ట్స్ రాగానే పేషెంట్ తాలూక వాళ్ళని భయపెట్టి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేలా సీన్ క్రియేట్ చేయాలి. మాట వింటే ఒకే లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని నమ్మించి కవర్ చేయాలని రాజ్యలక్ష్మి అంటుంది. తప్పు కదా అని దివ్య అంటుంది. వాళ్ళకి రాచమర్యాదలు చేసి గంటకోకసారి డాక్టర్స్ వెళ్ళి చెక్ చేసి కుదిరితే వేలల్లో లేదంటే లక్షల్లో బిల్లు వేయాలని చెప్తుంది. కానీ దివ్య మాత్రం అది మోసం చేయడం అవుతుంది, నిజాయితీగా జాబ్ చేయాలి అలా కుదరదు అంటే ఇక్కడ నాకు జాబ్ అవసరం లేదని దివ్య అంటుంది. కానీ రాజ్యలక్ష్మి కోపాన్ని అణుచుకుని ప్లేట్ ఫిరాయిస్తుంది. మాకు ఇలాంటి డాక్టర్స్ కావాలని తనకి జాబ్ ఇస్తుంది. మన హాస్పిటల్ కి డబ్బుతో పాటు మంచి పేరు కూడా రావాలని రాజ్యలక్ష్మి అంటుంది. కథలోకి కొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు. అటు నందు, లాస్య దివ్యకి పెళ్లి సంబంధం ఖాయం చేస్తారు.